For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే విజన్ 2030: రూ 50 లక్షల కోట్ల పెట్టుబడులు... ఎందుకో తెలుసా?

|

రైలు బండి. కూ... ఛుక్ ఛుక్ అంటూ పొగలు కక్కుతూ వెళ్లే ఒకప్పటి రైళ్లు ఇప్పుడు లేవు. దాదాపు అన్ని రైళ్ళూ ఎలక్ట్రిసిటీ తో నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అలాగే కొన్ని లక్షల టన్నుల సరుకును రవాణా చేస్తుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వేస్... ఏర్పాటై సుమారు 160 ఏళ్ళు దాటింది. 13 లక్షల మంది ఉద్యోగులతో ఇండియా లో అత్యధిక మంది ఉద్యోగులు కలిగిన ఏకైక సంస్థగా రికార్డు నెలకొల్పింది. అయితే, వందేళ్ల వయసు మీద పడినా... మారుతున్నా కాలానికి అనుగుణంగా సంస్థలో పెద్దగా మార్పులు రాలేదు.

ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్ : మహిళలు కొత్త ఏడాదిలో ఇలా చేయండి..ఆర్ధిక మందగమనం ఎఫెక్ట్ : మహిళలు కొత్త ఏడాదిలో ఇలా చేయండి..

ఎందుకంటే ఇప్పటికీ ఈ సంస్థ బ్రిటిష్ కాలం నాటి విధానాలు అవలంభిస్తుంది. నిర్వహణ అంత కూడా రైల్వే బోర్డు చేతిలోనే ఉంటుంది. దానిని సమూలంగా మార్చివేసి, డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్పులు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం విజన్ 2030ని ఆవిష్కరించింది. దాని ప్రకారం రైల్వేస్ ను సమూలంగా మార్చివేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు సర్వ సౌకర్యాలు కల్పించేందుకు, రైలు స్పీడ్ పెంచేందుకు, వేగంగా సరుకు రవాణా జరిగేందుకు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టాలని తీర్మానించింది. ఈ పదేళ్లలో రైల్వేస్ ను సంస్కరించాలని కంకణం కట్టుకుంది.

 The mega restructuring of Indian Railways to achieve vision 2030

రూ 50 లక్షల కోట్ల పెట్టుబడులు...
ప్రపంచ దేశాలు, ముఖ్యంగా మన పొరుగు దేశం చైనా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ మనకు సవాళ్లు విసురుతోంది. అక్కడ బులెట్ రైళ్లు గంటకు 300 కిలో మీటర్ల తో దూసుకు పోతుంటే... మన దేశంలో గంటకు 100 కిలో మీటర్ల వేగమే గగనం అయిపోయింది. ప్రస్తుత కాలంలో వేగం పెరగక పోతే వెనకపడిపోవటం ఖాయం. అందుకే ఇండియన్ రైల్వే మార్గాలను పూర్తిగా నవీకరించనున్నారు. సింగల్ గేజ్ అనేది లేకుండా బ్రాడ్ గేజ్ వైపు, పూర్తిగా ఎలక్ట్రిసిటీ తో నడిచే దిశగా అడుగులు వేస్తోంది. ప్రయాణికులకు 100% సురక్షితమైన ప్రయాణాన్ని అందించటం లక్ష్యంగా పెట్టుకుంది. సౌకర్యాల విషయంలోనూ విమానయానం అనుభూతిని అందించనుంది.

రైలు మార్గాలను ఆధునికీకరించటంతో ప్రయాణ వేగం పెరుగుతుంది. మనుషులు లేని రైల్వే గేట్ లేకుండా చర్యలు తీసుకుంటారు. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తారు. సరుకు రవాణా వేగం, సామర్థ్యాన్ని విస్తరిస్తారు. ఇందుకోసం ఏకంగా రూ 50,00,000 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఘనమైన వారసత్వం కలిగిన ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో అత్యుత్తమ రైల్వేస్ లో ఒకటి అయ్యేలా తీర్చిదిద్దుతారు.

రైల్వే బోర్డు సమూల మార్పు...
ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ మొత్తం రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం నడుస్తుంటుంది. రైల్వేస్ కొన్ని విభాగాలుగా విడివిడిగా ఉంటుంది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టిఎస్), ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఈ), ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఎంఈ), ఫైనాన్స్ విభాగాలతో ప్రత్యేకంగా కార్యాలపాలు సాగిస్తుంటుంది. ఇందులో ఆఫీసర్లకు ప్రమోషన్ కూడా సంబంధిత విభాగంలో మాత్రమే ఉంటుంది.

ఒక్క డివిషనల్ రీజినల్ మేనేజర్ (డీఆర్ఎం), జనరల్ మేనేజర్ (జిఎం) పోస్టులు మినహా అన్నిటా ఒక్క విభాగం పరిధిలో ఉంటుంది. దీంతో ఒకదానితో ఒకటి పోటీ పడటం ఉండదు. అలాగని పెద్దగా కలిసి పనిచేయరు. దీంతో అనుకున్నంత వేగం కార్యకలాపాల్లో కనిపించదు. ఇకపై అలా కాకుండా బోర్డులో సీఈఓ నేతృత్వంలో అన్ని విభాగాలకు మెంబెర్స్ ను కేటాయించి నడిపిస్తారు. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు.

10 ఏళ్లలో పూర్తిగా కొత్తగా...
ప్రభుత్వం నిర్ణయించిన ప్రణాళిక పూర్తిగా అమలు చేయగలిగితే .. వచ్చే 10 ఏళ్లలో ఇండియన్ రైల్వేస్ సమూలంగా మారిపోనుంది. రైలు బండిలో కారు లాంటి సదుపాయాలు రానున్నాయి. వైఫై, సినిమాలు చూసే అవకాశం లభించనుంది. నాణ్యమైన ఆహారం, సురక్షితమైన నీరు సరఫరా చేస్తారు. మన ఒక సినిమా చూసేంతలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోయేలా వేగం పెరగబోతోంది. అలాగే సరుకు రవాణా వేగం పెరగటంతో మనకు రావాల్సిన పార్సెల్స్ కూడా వేగంగా వస్తాయి. దేశం నుంచి జరిగే ఎగుమతులు, అలాగే దిగుమతుల్లో కూడా స్పీడ్ పెరుగుతుంది. అది పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

English summary

రైల్వే విజన్ 2030: రూ 50 లక్షల కోట్ల పెట్టుబడులు... ఎందుకో తెలుసా? | The mega restructuring of Indian Railways to achieve vision 2030

Large organisations are rarely restructured. If they are government or public-owned, restructuring is even rarer.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X