ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో.. సెప్టెంబర్ నెలలోనే అధికారిక ఉద్యోగాల కల్పన
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో భారతదేశంలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కరోనా కట్టడి పైనే దృష్టి పెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగాల కల్పనపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇదే సమయంలో ప్రైవేటు సంస్థలు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.
బడా కార్పోరేట్ దిగ్గజాల బ్యాంకింగ్ ఎంట్రీ: ఆర్బీఐ ఇంటర్నల్ గ్రూప్ నివేదికపై ఆసక్తికర చర్చ
అప్పటి నుండి చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో పడ్డారు. అయితే కరోనా మహమ్మారి ఇంకా తన పంజా విసురుతున్న సమయంలో ఉద్యోగాలు పొందడం నిరుద్యోగులకు కష్టమైపోయింది.

ఇక ఈ సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ త్రైమాసికంలో సెప్టెంబర్ లోనే అధికారిక ఉద్యోగాలు అధిక సంఖ్యలో సృష్టించబడిన ట్లుగా తెలుస్తుంది. ఇది భారతదేశంలో అధికారికంగా పనిచేసే కార్మికులు డిమాండ్ కు అద్దం పడుతుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో అధికారిక ఉద్యోగాలు సెప్టెంబర్ నెలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రెండింటిలోనూ సృష్టించబడ్డాయి. ఇది దేశంలో అధికారిక కార్మికులకు డిమాండ్ పెరగడాన్ని సూచిస్తుంది.
జూన్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య కనిష్ట స్థాయిని తాకింది. ఇక ఆ తర్వాత జాతీయ పెన్షన్ పథకానికి చందా కూడా నెలవారీగా పెరుగుతోంది. బుధవారం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా పేరోల్ డేటా, ఈపీఎఫ్ క్రింద నికర కొత్త చేరికలు ఉన్నకారణంగా ఉద్యోగుల సంఖ్య పెరిగిందని గుర్తించవచ్చు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ద్వారా వేతన రాయితీ వల్ల కేంద్రానికి, 6,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది . అయితే దీనివల్ల రాబోయే రెండేళ్ళలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించడానికి సహాయపడవచ్చునని తెలుస్తుంది.