Penny Stock: నెలలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించి పెన్నీ స్టాక్.. అప్పర్ సర్క్యూట్లలో లాక్ అవుతూ..
Multibagger Stock: దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్‌లు రాబడి మెరుగ్గా ఉన్నాయి. టెక్స్ టైల్ రంగానికి చెందిన ఈ పెన్నీ స్టాక్ కూడా తన ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించింది. బరోడా రేయాన్ కార్పొరేషన్(Baroda Rayon Corporation) తక్కువ వ్యవధిలో మల్టీబ్యాగర్ రాబడులతో తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది. మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ.. జూన్ 1, 2022 నుంచి స్టాక్ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయి ఉంది.

బరోడా రేయాన్ షేర్ ధర హిస్టరీ..
బరోడా రేయాన్ కార్పొరేషన్ షేర్లు జూన్ 1, 2022న రూ.4.50 స్థాయి నుంచి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. శుక్రవారం నాడు స్టాక్ 4.94% లాభపడి రూ.11.04 ఎగువ సర్క్యూట్‌ను తాకింది. గత ఐదేళ్లలో స్టాక్ రూ.5.11 నుంచి ప్రస్తుత స్థాయికి పెరిగింది. ఈ కాలంలో 116.05 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. షేరు ధర రూ.4.64 నుంచి రూ.11.04కి పెరిగినందున మునుపటి సంవత్సరం కంటే 137.93 శాతం మల్టీబ్యాగర్ రాబడిని కలిగి ఉంది. ఈ స్టాక్ 2022లో ఇప్పటివరకు 137.93 శాతం రిటర్న్స్ అందించింది.

కొత్త గరిష్ఠాలకు స్టాక్..
గత ఆరు నెలల్లో ఈ రిటర్న్ వేగాన్ని స్టాక్ నిలకడగా కొనసాగించింది. జూన్ 6, 2022న స్టాక్ రూ.5.36కి పెరిగింది. ఈ కాలంలో ఇది 105.97 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. బరోడా రేయాన్ 5-రోజులు, 20-రోజులు, 50-రోజులు, 100-రోజులు, 200-రోజుల మూవింగ్ యావరోజ్ రూ.11.04 స్థాయిలో ట్రేడవుతోంది. ఇది స్టాక్ కొత్త 52 వారాల గరిష్ఠ ధర. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో ఈ షేరు 15.60 శాతం లాభపడింది.

కనిష్ఠ స్థాయి నుంచి 149 శాతం పెరిగి..
జూలై 1, 2022న స్టాక్ కొత్త 52-వారాల గరిష్ఠమైన రూ.11.04 వద్ద ఉంది. జూన్ 1, 2022న దాని 52 వారాల కనిష్ఠమైన రూ.4.42 వద్ద ఉంది. అంటే.. కేవలం ఒక్క నెల సమయంలో స్టాక్ మంచి రాబడులను అందించింది. మార్చి 2022తో ముగిసిన క్వార్టర్ లో కంపెనీ రూ.163.49 కోట్ల వార్షిక EPS వృద్ధిని నమోదు చేసింది. మార్చి 2022కి ROE రూ.1,498.92 కోట్లు.. ఇది ఆల్ టైమ్ హై. జూన్ 2019 నుంచి కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్ స్థిరంగా 47.54 శాతంగా ఉంది. ఈ కాలంలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 50.97 శాతంగా ఉంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం అందించటం కోసం ఇచ్చింది మాత్రమే. ఈ వివరాల ఆదారంగా ఎటువంటి ట్రేడింగ్ చేయవద్దు. పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా మీ విచక్షణను ఉపయోగించండి లేదా మీ ఆర్థిక సలహాదారును సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.