For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెస్లా వద్ద ఎంత బిట్ కాయిన్ ఉందంటే: వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

|

ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ జూన్ త్రైమాసికం ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ కంపెనీ వద్ద ఇప్పటికీ 1.3 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బిట్ కాయిన్స్ ఉన్నట్లుగా బ్యాలెన్స్ షీట్ వెల్లడిస్తోంది. ఈ కంపెనీ తన బిట్ కాయిన్ వ్యాల్యూను తగ్గించుకుంటుందని చెప్పడానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు. అదే సమయంలో టెస్లా తన డిజిటల్ ఆస్తులను జోడించలేదని వెల్లడవుతోందని అంటున్నారు. అంతేకాదు, జూన్ త్రైమాసికంలో బిట్ కాయిన్ ప్రభావం త్రైమాసిక ఫలితాలపై పడిందని టెస్లా వెల్లడించింది.

అందుకే టెస్లా మానివేసింది

అందుకే టెస్లా మానివేసింది

తమ కంపెనీ డిజిటల్ అసెట్స్‌లో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోందని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో టెస్లా అధినేత ఎలాన్ మస్కా తెలిపారు. అంతేకాదు, తమ కార్ల కోసం బిట్ కాయిన్‌ను పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తామని తెలిపింది. అయితే మార్చి త్రైమాసికం అనంతరం టెస్లా డిజిటల్ హోల్డింగ్స్‌లో పది శాతం క్షీణించాయి. ఈ మేరకు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. పర్యావరణ అంశాన్ని పరిగణలోకి తీసుకొని బిట్ కాయిన్‌ను కంపెనీ స్వీకరించడం మానివేసింది.

గ్రీన్ ఎనర్జీ వాటా

గ్రీన్ ఎనర్జీ వాటా

అయితే ఇటీవల టెస్లా ఇంక్ బిట్ కాయిన్‌ను నగదుగా స్వీకరించడం ప్రారంభిస్తుందని టెస్లా అధినేత వెల్లడించారు. టెస్లా బిట్ కాయిన్‌ను స్వీకరించడం ప్రారంభిస్తుందని ఇటీవల ఎలాన్ మస్క్ తిరిగి తెలిపారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, పలు దేశాల చర్యల అనంతరం బిట్ కాయిన్ మైనింగ్‌లో గ్రీన్ ఎనర్జీ వాటా అంటే జూన్ త్రైమాసికానికి 56 శాతానికి చేరుకుంది. అంతకుముందు మార్చి త్రైమాసికంలో ఇది 36.8 శాతంగా మాత్రమే ఉంది.

క్రిప్టో వ్యాల్యూ

క్రిప్టో వ్యాల్యూ

క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ నేడు 37000 డాలర్లను క్రాస్ చేసింది. ఈ నెలలో ఈ మార్క్ దాటడం ఇదే మొదటిసారి. వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ...

Bitcoin - 37,101,70 డాలర్లు

Ethereum - 2182.23 డాలర్లు

Binance Coin - 302.37 డాలర్లు

Cardano - 1.24 డాలర్లు

Dogecoin - 0.1991 డాలర్లు

XRP - 0.618 డాలర్లు

Polkadot - 13.64 డాలర్లు

Bitcoin Cash - 473.95 డాలర్లు

Solana - 27.84 డాలర్లు

Litecoin - 129.84 డాలర్లు

English summary

టెస్లా వద్ద ఎంత బిట్ కాయిన్ ఉందంటే: వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ | Tesla still holds $1.3 billion worth of bitcoin

Tesla’s June quarter earnings on Monday showed that the US-based electric car company was still holding $1.3 billion worth of bitcoin on its balance sheet, putting to rest speculations that the company might have trimmed its position during the period.
Story first published: Tuesday, July 27, 2021, 20:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X