For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పగిలిన సైబర్ ట్రక్ కారు అద్దం, ఎలాన్ రూ.55,13,67,16,800 కోట్లు ఆవిరి

|

టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌కు 'లైవ్' షాక్ తగిలింది. టెస్లా ఏం చేసినా అది సంచలనమే. ఎలాన్ మస్క్ ఆస్తులు 22.3 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. అయితే తాజాగా టెస్లా కంపెనీ చేసిన ఓ లైవ్ డెమో ఫెయిల్ అయింది. దీంతో టెస్లా కంపెనీ షేర్లు భారీగా కుంగిపోయాయి. ఈ దెబ్బకు ఎలాన్ మస్క్ ఆస్తులు కూడా కరిగిపోయాయి.

ఉద్యోగులపై ఒత్తిడి?: కాగ్నిజెంట్ కొత్త నిర్ణయంఉద్యోగులపై ఒత్తిడి?: కాగ్నిజెంట్ కొత్త నిర్ణయం

డెమోలో పగిలిన అద్దం

డెమోలో పగిలిన అద్దం

టెస్లా సంస్థ తాజాగా సైబర్ ట్రక్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ను పరిచయం చేసింది. ఈ సైబర్ ట్రక్ వివరాలను వెల్లడిస్తున్న సమయంలో దాని కిటికీ అద్దాలు అసలు పగలవని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత దానిపై మెటల్ బాల్ విసిరి లైవ్‌లో దానిని చూపించాలనుకున్నారు. ఈ డెమో సమయంలో గురువారం కిటికీ అద్దం పగిలిపోయింది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆటో షోలో ఇది జరిగింది.

ఎలాన్ మస్క్‌కు షాక్

ఎలాన్ మస్క్‌కు షాక్

దిమ్మతిరిగిపోయిన ఎలాన్ మస్క్ షాక్‌కు గురయ్యారు. దీనిని మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. అయితే ఆ సమయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లైవ్ డెమోలో ఇది ఫెయిల్ కావడంతో టెస్లా షేర్లు శుక్రవారం దాదాపు 6 శాతం పతనమయ్యాయి. పైగా ట్రక్ డిజైన్ కూడా బాగా లేదని ట్రోల్స్ వచ్చాయి. మరోవైపు, టెస్లాకు పోటీగా విద్యుత్ పికప్ ట్రక్కును 2021లో మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న జనరల్ మోటార్స్ షేర్లు 2 శాతం పెరిగాయి.

కరిగిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తులు

కరిగిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తులు

టెస్లా ఈ ప్రయోగం ఫెయిలై, షేర్లు పతనమవడంతో ఎలాన్ మస్క్ ఆస్తులు కూడా కొంతమేర కరిగిపోయాయి. ఆయన సంపద ఒక్క రోజులోనే 768 మిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఆయన సంపద 16,00,97,49,80,000కు పైగా ఉంటుంది. కరిగిపోయిన ఆస్తులు మన కరెన్సీలో రూ.5,500 కోట్లకు (768 మిలియన్ డాలర్లు) పైగా ఉంటుంది. కంపెనీ షేర్లు 333.41 డాలర్లకు పడిపోయాయి.

మెటల్ బాల్‌తో...

మెటల్ బాల్‌తో...

డిజైన్ హెడ్ ఫ్రాంజ్ వోన్ హోల్జేసెన్ ఈ పికప్ ట్రక్ డ్రైవర్ కారు అద్దం పైన మెటల్ బాల్‌తో బలంగా కొట్టారు. ప్యాసింజర్ విండో పైన కూడా బలంగా మెటల్ బాల్‌తో కొడతారు. కానీ అవి పగిలిపోతాయి. ఈ అద్దాలు పగలడంతో దీనిని ఇంప్రూవ్ చేస్తామని చెప్పారు.

English summary

పగిలిన సైబర్ ట్రక్ కారు అద్దం, ఎలాన్ రూ.55,13,67,16,800 కోట్లు ఆవిరి | Tesla's share price fall after its Cybertruck's shatterproof windows break in a demo

Tesla's share price plummets 6 percent and wipes $768 million off Elon Musk's fortune after 'shatterproof' windows on his electric 'cybertruck' smashed during a demo.
Story first published: Sunday, November 24, 2019, 17:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X