For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం, బిట్ కాయిన్స్‌తో టెస్లా కారు కొనవచ్చు

|

ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ చీఫ్ ఎలాన్ మస్క్ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నుండి అమెరికా వెలుపల బిట్ కాయిన్స్‌తో చెల్లింపులు చేసి టెస్లా కార్లను కొనుగోలు చేయవచ్చునన్నారు. 'మీరు బిట్ కాయిన్‌తో టెస్లాను కొనుగోలు చేయవచ్చున'ని ఆయన ట్వీట్ చేశారు. అలా చేసిన చెల్లింపుల్ని మామూలు కరెన్సీలోకి మార్చలేమని తెలిపారు. ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా 1.5 బిలియన్ డాలర్ల బిట్ కాయిన్స్‌ను కొనుగోలు చేస్తోందని, కార్ల చెల్లింపులను కూడా ఈ మాధ్యంలో ఆమోదిస్తామని గత నెలలో ప్రకటించింది.

ప్ర‌పంచంలో బిట్ కాయిన్‌ను అనుమ‌తించిన మొదటి కార్ల త‌యారీ సంస్థ టెస్లా కావడం గమనార్హం. బిట్ కాయిన్‌లో టెస్లా భారీగా పెట్టుబడులు పెడుతోంది. మాస్టర్ కార్డు కూడా బిట్ కాయిన్‌కు అనుకూలంగా ప్రకటన చేసింది. ఉబెర్ టెక్నాలజీస్ సహా పలు సంస్థలు తమ అభిప్రాయాలను వెంబడించాయి. జనరల్ మోటార్స్ సంస్థ ఇలాంటి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

 Tesla cars can be bought in Bitcoin

ఇటీవల బిట్ కాయిన్స్ వ్యాల్యూ గణనీయంగా పెరుగుతోంది. ఎలాన్ మస్క్ కూడా క్రిప్టోకరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఆయన తరచూ ట్విటర్‌లో బిట్ కాయిన్స్‌కు అనుకూలంగా ట్వీట్స్ చేస్తున్నారు. బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్‌ను ఆప‌రేట్ చేయ‌డానికి టెస్లా కేవ‌లం అంత‌ర్గత‌, ఓపెన్ సోర్స్ సాఫ్టువేర్‌ను ఉప‌యోగిస్తోంద‌ని మస్క్ తెలిపారు.

English summary

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం, బిట్ కాయిన్స్‌తో టెస్లా కారు కొనవచ్చు | Tesla cars can be bought in Bitcoin

Tesla customers can now buy their car with Bitcoin, company chief Elon Musk has said.
Story first published: Wednesday, March 24, 2021, 20:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X