For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పుడు అలా చెప్పి..: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం, బిట్‌కాయిన్‌లో భారీ పెట్టుబడి

|

బిట్‌కాయిన్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా టెస్లా ఇంక్ బిట్ కాయిన్ కొనుగోలు చర్చనీయాంశంగా మారింది. కరోనా మహమ్మారి ముందు బిట్ కాయిన్ 5వేల డాలర్లుగా ఉండగా, ఇప్పుడు 44వేల డాలర్లస్థాయికి చేరుకుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో భారీగా ఎగిసింది. ఇప్పుడు గ్లోబల్ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా యాజమాన్యం 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. దీంతో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌కు వ్యాల్యూ మరింతగా పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టాన్ని చేరుకుంది.

ఇంకా క్యూలో నిలుచుంటున్నారా? ఎస్బీఐ ADWMతో అన్ని బ్యాంకింగ్ సేవలు పొందవచ్చుఇంకా క్యూలో నిలుచుంటున్నారా? ఎస్బీఐ ADWMతో అన్ని బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు

టెస్లా ఎఫెక్ట్.. 45వేల డాలర్లకు బిట్ కాయిన్

టెస్లా ఎఫెక్ట్.. 45వేల డాలర్లకు బిట్ కాయిన్

బిట్ కాయిన్‌లో అత్య‌ధిక పెట్టుబ‌డులు పెట్టిన సంస్థ‌గా టెస్లా నిలిచింది. బిట్ కాయిన్‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో టెస్లా తెలిపింది. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ 16 శాతం పెరిగి 45 వేల డాల‌ర్ల‌కు చేరుకుంది. తమ సంస్థ విద్యుత్ కార్ల చెల్లింపుల కోసం డిజిట‌ల్ క‌రెన్సీని అంగీకరించనున్నట్లు టెస్లా తెలిపింది.

తగిన ఆపరేటింగ్ లిక్విడిటీ నిర్వహణ కోసం, అవసరంలేని తమ నగదుపై రాబడిని విస్తృతం చేసే ఉద్దేశ్యంలో భాగంగా తమ పెట్టుబడి విధానాన్ని నవీకరించినట్లు టెస్లా పేర్కొంది. భవిష్యత్తులోను బిట్ కాయిన్‌ను తమ ఉత్పత్తి, సేవల చెల్లింపులను బిట్ కాయిన్ రూపంలో అంగీకరించడం ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపింది. చట్టాలకు లోబడి ఉంటుందని తెలిపింది.

ఇటీవలే ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు

ఇటీవలే ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు

బిట్‌కాయిన్‌కు తాను మద్దతిస్తానని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు. బిట్ కాయిన్ మంచిదని, ఏళ్ల క్రితమే వీటిని తాను కొనుక్కుని ఉంటే బాగుండేదన్నారు. సోషల్ ఆడియో యాప్ క్లబ్ హౌస్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలో తాను బిట్ కాయిన్‌కు మాత్రమే మద్దతిస్తానన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే భారీ మొత్తంలో కొనుగోలు చేయడం గమనార్హం.

అంతకంతకూ డిమాండ్

అంతకంతకూ డిమాండ్

గత నెలలో నాలుగో త్రైమాసిక ఆదాయ నివేదికలో టెస్లా వద్ద నగదు, నగదు సమానమైన 19.4 బిలియన్ డాలర్లు ఉన్నాయని ప్రకటించింది. బిట్ కాయిన్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. బిట్ కాయిన్ వ్యాల్యూ అతి కొద్ది రోజుల్లోనే 40 వేల డాలర్లు దాటి, 45వేల డాలర్లకు చేరుకుంది. క్రిప్టో కరెన్సీ కలిగిన చాలామంది త్వరగా సంపన్నులైన సందర్భాలు ఉన్నాయి.

English summary

అప్పుడు అలా చెప్పి..: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం, బిట్‌కాయిన్‌లో భారీ పెట్టుబడి | Tesla buys bitcoin worth $1.5 billion, to accept the cryptocurrency as payment

Tesla bought bitcoins worth $1.5 billion in January 2021 after the company updated its investment policy to invest in digital assets, a filing with the Securities Exchange Commission showed.
Story first published: Tuesday, February 9, 2021, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X