For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు

|

అయిదేళ్ల తర్వాత మళ్లీ స్పెక్ట్రం వేలం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం (మార్చి 1) రూ.77,146 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. బిడ్స్ దాఖలు చేసిన వాటిలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఉన్నాయి. రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2250 MHz ను ఏడు బాండ్లలో అందుబాటులో ఉంచింది. తొలి రోజు రూ.77,146 కోట్ల విలువ చేసే బిడ్స్ దాఖలయ్యాయని టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. బిడ్డింగ్‌కు స్పందన ప్రభుత్వం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందన్నారు.

తొలిరోజు రూ.77,146 కోట్ల విలువైన బిడ్స్

తొలిరోజు రూ.77,146 కోట్ల విలువైన బిడ్స్

తొలిరోజు రూ.77,146 కోట్ల విలువైన స్పెక్ట్రంకు బిడ్స్ అందాయని, 700, 2500 మెగాహెర్ట్జ్‌ బాండ్లకు ఎవరూ బిడ్‌లు దాఖలు చేయలేదు. 800, 900, 1800, 2100, 2300 MHz ఫ్రీక్వెన్సీ బాండ్స్‌కు బిడ్స్ వచ్చాయని, వేలం కొనసాగుతుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2016 వేలంలో పూర్తిగా అమ్ముడుపోని 700 MHz స్పెక్ట్రం మొత్తం స్పెక్ట్రంలో మూడోవంతు భాగాన్ని ఆక్రమించాయి. కొత్త స్పెక్ట్రం బాండ్‌కు వెళ్తే సామగ్రిపై అదనపు వ్యయాలు పెట్టాల్సి ఉంటుందన్న కారణంగా ఆపరేటర్లు దూరంగా ఉంటున్నారని భావిస్తున్నారు. సబ్ గిగాహెర్ట్జ్ బాండ్స్ తక్కువ ధరలకే లభిస్తుందని అంటున్నారు.

ఊహించిన దాని కంటే ఎక్కువ

ఊహించిన దాని కంటే ఎక్కువ

ప్రీమియమ్ బ్యాండ్స్ 700, 2500 MHz స్పెక్ట్రం కోసం ఏ కంపెనీ బిడ్ చేయలేదన్నారు. మంగళవారం వేలం ముగియనుంది. స్పెక్ట్రంకు మూడు సంస్థలే పోటీపడుతున్నాయని, అదీ గత స్పెక్ట్రంనే రెన్యూవల్ చేసుకోనున్నాయని, కాబట్టి బిడ్స్ రూ.45,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని అంచనా వేశారు. అయితే దానికి మించి బిడ్స్ వచ్చాయి. బిడ్స్ వారీగా వివరాలు తెలియనప్పటికీ దాదాపు 849.20 MHz పరిమాణానికి బిడ్స్ వచ్చినట్లు కేంద్రం తెలిపింది.

700 MHz ఎక్కువ

700 MHz ఎక్కువ

మొత్తం స్పెక్ట్రం వేలం వ్యాల్యూ రూ.4 లక్షల కోట్ల వరకు ఉండగా, ఇందులో 700 MHz బ్యాండ్ ఖరీదైనది. దీని వ్యాల్యూనే రూ.1.97 లక్షల కోట్లు. 5G సేవలకు ఉపయోగపడే 700 MHz బ్యాండ్‌కు 2016లో నిర్వహించిన వేలంలో స్పందన లభించలేదు. ఒకవేళ రేటు కారణంగా ప్రస్తుత వేలంలోనూ అమ్ముడు కాకపోతే దీనిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని రవిశంకరప్రసాద్ తెలిపారు. చెప్పారు. కరోనా నేపథ్యంలో ఎకానమీ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వేలం జరుగుతున్నప్పటికీ ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తుండటం సానుకూల అంశమన్నారు.

English summary

టెలికం స్పెక్ట్రం వేలం, అంచనాలకు మించి భారీగా బిడ్స్: పోటీలో ఈ కంపెనీలు | Telecom Spectrum Auction: Bids Worth Rs 77,146 Crore Received On Day 1

India's first auction of spectrum in five years attracted Rs 77,146 crore of bids on the opening day on Monday with Reliance Jio Infocomm Ltd., Bharti Airtel Ltd., and Vodafone Idea Ltd. participating in the bidding process - a response that the government said was better than expected.
Story first published: Tuesday, March 2, 2021, 8:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X