For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాకు కేటీఆర్: పెట్టుబడులు మాత్రమే కాదు..: ఆసక్తికరంగా ట్వీట్

|

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయిదేళ్ల తరువాత తొలిసారిగా అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. వారం రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన పలు సదస్సులు, సమ్మిట్‌లకు హాజరు కానున్నారు. తాను అమెరికాకు బయలుదేరి వెళ్లినట్లు ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. వచ్చేవారం అంతా పలు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని దక్షిణాది రాష్ట్రాల్లో తమ లావాదేవీలను నిర్వహిస్తోన్నాయి. అమెజాన్, ఫేస్‌బుక్‌, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐకియా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ను తమ ప్రధాన కేంద్రంగా చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్‌గా ఆవిర్భవించింది.

Telangana Minister for IT KTR US trip for attracting investments in the State

మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా కేటీఆర్.. తాజాగా అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడానికి ఈ పర్యటనను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చేవారం పలు బిజినెస్ కాన్ఫరెన్స్‌లల్లో ఆయన పాల్గొనబోతోన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలను ఈ సమ్మిట్ల ద్వారా పెట్టుబడిదారులకు వివరించనున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి విరాళాలను సేకరించడానికీ ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడ ఎన్‌ఆర్‌ఐలతోనూ సమావేశం కానున్నారు. తమ సొంత గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి విరాళాలను అందజేయాలంటూ కేటీఆర్ ఎన్ఆర్ఐలను విజ్ఞప్తి చేయనున్నారు. తెలుగు అసోసియేషన్లతో భేటీ కానున్నారు.

కోటి రూపాయలకు పైగా విరాళాన్ని అందజేసిన వారి పేరును ప్రభుత్వ పాఠ‌శాల‌కు పెట్టే అవకాశం ఉన్నందున, ఈ విషయాన్ని కూడా కేటీఆర్ వారికి వివరిస్తారు. అలాగే- 20 ల‌క్షల రూపాయల వరకు విరాళం ఇచ్చిన వారి పేర్లను తరగతి గదుకు పెట్టనున్నారు. వచ్చేవారం ఏర్పాటు కాబోయే సమావేశాలు, సదస్సుల్లో పాల్గొనడానకి ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. అయిదు సంవత్సరాల తరువాత తొలిసారిగా అమెరికా వెళ్తున్నానని చెప్పారు.

English summary

అమెరికాకు కేటీఆర్: పెట్టుబడులు మాత్రమే కాదు..: ఆసక్తికరంగా ట్వీట్ | Telangana Minister for IT KTR US trip for attracting investments in the State

Telangana Minister KTR US trip for attracting investments in the State. This is his first US tour after 5 years.
Story first published: Saturday, March 19, 2022, 11:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X