For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త సంవత్సరంలో ఏపీ-తెలంగాణలో లిక్కర్ సేల్స్ ఎంత పెరిగాయంటే?

|

హైదరాబాద్/అమరావతి: కొత్త సంవత్సరం అంటే యువతకు పట్టలేని ఆనందం. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1 వరకు కొత్త లోకంలో తేలియాడుతారు. అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు. డిసెంబర్ 31వ, జనవరి 1 సందర్భంగా చాలామంది మద్యం తీసుకుంటారు. ఈ నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో మద్యం ఏరులై పారిందట.

BHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండిBHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండి

తెలంగాణలో రూ.378 కోట్ల లిక్కర్ సేల్స్

తెలంగాణలో రూ.378 కోట్ల లిక్కర్ సేల్స్

రెండు రోజుల వ్యవధిలో తెలంగాణలో రూ.378 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2019 సంవత్సరం చివరిరోజు (డిసెంబర్ 31) మద్యం అందుబాటులో ఉండదనే ఉద్దేశ్యంతో చాలామంది అంతకుముందు రోజే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. బీరు, మద్యం కలిపి రాష్ట్రంలో రెండు రోజుల్లో 83.43 లక్షల లీటర్ల సేల్స్ జరిగాయి.

150 శాతం ఎక్కువ

150 శాతం ఎక్కువ

సగటున రోజువారీ అమ్మకాల కంటే డిసెంబర్ 31వ తేదీ రోజు అమ్మకాలు 150 శాతం ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తెలంగాణలో రూ.2,050 కోట్ల విక్రయాలు జరగగా, సగటున రూ.66 కోట్ల సేల్స్ జరిగినట్లు. కానీ డిసెంబర్ 30, 31వ తేదీల్లో రెండు రోజుల్లోనే రూ.378 కోట్ల సేల్స్ జరిగాయి. డిసెంబర్ 30న రూ.220 కోట్లు, డిసెంబర్ 31న రూ.158 కోట్ల సేల్స్ జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ...

ఆంధ్రప్రదేశ్‌లోనూ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను మద్యం విక్రయాలు భారీగానే జరిగాయి. మంగళవారం రూ.92 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్ జరిగాయి. ఏపీలో సాధారణంగా రోజుకు రూ.50 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్ ఉంటాయి. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న ఇది దాదాపు రెట్టింపు అయింది. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న లిక్కర్ షాప్స్‌కు రాత్రి 12 గంటల వరకు, బార్లకు రాత్రి 1 గంటల వరకు ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఏపీలో కొత్త ప్రభుత్వం రూల్స్ మార్చడంతో ఈ డిసెంబర్ 31న రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలు, 10 గంటలకే బార్లు క్లోజ్ అయ్యాయి. కానీ లిక్కర్ సేల్స్ మాత్రం దాదాపు రెండింతలు పెరిగాయి.

English summary

కొత్త సంవత్సరంలో ఏపీ-తెలంగాణలో లిక్కర్ సేల్స్ ఎంత పెరిగాయంటే? | telangana gulps down liquor worth rs 380 crore on new year eve, In AP Rs 92 crore sales

Tipplers and New Year revellers had a field day in Telangana as liquor worth Rs 380 crore was sold across the state during the last two days, officials said on Wednesday.
Story first published: Thursday, January 2, 2020, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X