For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..

|

Telangana Budget: బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లను కేటాయించింది. ఇదే క్రమంలో విద్యా రంగానికి రూ.19,093 కోట్లను ప్రభుత్వం అందించింది.

రుణమాఫీకి నిధులు..

రుణమాఫీకి నిధులు..

రైతుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన రుణమాఫీ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సారి రూ.6,385 కోట్లను అందించింది. అలాగే హరిత హారం పథకానికి రూ.1,471 కోట్లను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.2,500 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు, హోం శాఖకు రూ.9,599 కోట్లను కేటాయించింది.

మహిళా శిశు సంక్షేమం..

మహిళా శిశు సంక్షేమం..

తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమం శాఖకు రూ.2,131 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లను అందిస్తోంది. రైతు బంధుకు రూ.1,575 కోట్లు, రైతు బీమాకు రూ.1,589 కోట్లు, షెడ్యూల్ కులాల ప్రత్యేక నిధికి రూ.36,750 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో తెలిపారు.

పల్లె ప్రగటి-పట్టణ ప్రగతి..

పల్లె ప్రగటి-పట్టణ ప్రగతి..

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన కేటీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్కీమ్ కోసం రూ.4,834 కోట్లను అందిస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.12,000 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,463 కోట్లను తెలంగాణ ఈ సారి బడ్జెట్లో కేటాయించింది.

ఐటీ రంగానికి కేటాయింపులు..

ఐటీ రంగానికి కేటాయింపులు..

రాష్ట్ర ప్రణాళికా విభాగానికి రూ.11,495 కోట్లు, ఐటీ & కమ్యూనికేషన్ శాఖకు రూ.366 కోట్లను బడ్జెట్ 2023-24 కింద తెలంగాణ కేటాయించింది. ఉన్నత విద్యా శాఖకు రూ.3,001 కోట్లు, న్యాయ శాఖకు రూ.1,665 కోట్లను కేటాయించారు. కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1,000 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ అందిస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు.

English summary

Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా.. | Telangana Budget allocated amount to health, education, women welfare and other sectors

Telangana Budget allocated amount to health, education, women welfare and other sectors
Story first published: Monday, February 6, 2023, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X