For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hyderabad: శుభవార్త చెప్పిన మంత్రి KTR.. హైదరాబాదుకు 5 వేల ఫైనాన్స్ కొలువులు..

|

Hyderabad: ఐటీతో పాటు ఫైనాన్స్ రంగంలోని కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్ నగరం ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులను మరింతగా పెంచటం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతోంది.

ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అండ్ ట్రేడింగ్ సేవలను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్. ఈ కంపెనీ తాజాగా హైదరాబాదులో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది.

Telanaga IT minister KTR Feels happy over State street expansion in Hyderabad

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే పనిలో టూర్ లో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆయన బోస్టన్‌లో కంపెనీ బృందంతో సమావేశమైన అనంతరం తాజా ప్రకటన వెలువడింది. కంపెనీ పెట్టుబడి నిర్ణయం వల్ల హైదరాబాదులో కొత్తగా 5 వేల ఉద్యోగాలు క్రియేట్ కానున్నాయి. ఇది హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ రంగానికి బోస్టన్ నుంచి వచ్చిన శుభవార్తనే చెప్పుకోవాలి.

స్టేట్ స్టీట్ కస్టడీలో ప్రస్తుతం 40 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు నిర్వహణలో ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటిగా ఉంది. హైదరాబాద్‌లో అకౌంటింగ్, హెచ్‌ఆర్ మరియు ఇతరుల పాత్రలు ఇప్పుడు స్టేట్ స్ట్రీట్‌కి బోస్టన్ ప్రధాన కార్యాలయం తర్వాత రెండవ అతిపెద్ద ఉనికిగా మారటంపై తనకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more about: ktr hyderabad
English summary

Hyderabad: శుభవార్త చెప్పిన మంత్రి KTR.. హైదరాబాదుకు 5 వేల ఫైనాన్స్ కొలువులు.. | Telanaga IT minister KTR Feels happy over State street expansion in Hyderabad

Telanaga IT minister KTR Feels happy over State street expansion in Hyderabad
Story first published: Thursday, May 25, 2023, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X