ఐటీ కంపెనీలు, బీపీవో సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31వ తేదీ వరకు ఇళ్ళ నుండి పని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

ఐటీ కంపెనీలకు ఊరట
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు కేంద్రం ఇంతకుముందు ఇచ్చిన అనుమతి ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్‌ను పొడిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ, బీపీవో కంపెనీల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జూలై 31వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తున్నట్లు రవిశంకర ప్రసాద్ తెలిపారు. తమ ఉద్యోగులను, సిబ్బందిని దశల వారీగా తిరిగి కార్యాలయాలకు రప్పించాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయం ఐటీకి ఊరట అని నాస్కామ్ తెలిపింది.

ఈ ఏడాదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి..
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అశ్వథ్ నారాయణ మాట్లాడుతూ... వర్క్ ఫ్రమ్ హోమ్‌ను మార్చి 31, 2021 వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఇవ్వాలని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్‌ను కోరారు. దీనికి రవిశంకర ప్రసాద్ స్పందిస్తూ.. జూలై చివరలో దీని గురించి ఆలోచిద్దామన్నారు.

ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్
వర్క్ ఫ్రమ్ హోమ్ దృష్ట్యా భారత్ నెట్ కింద ఇంటర్నెట్ సర్వీస్ మరింత బలపరుస్తామని రవిశంకర ప్రసాద్ చెప్పారు. దాదాపు 80 శాతం నుండి 90 శాతం ఐటీ కంపెనీలు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నాయి. కాగా, అంతకుముందు మార్చి నెలలో ఏప్రిల్ 30వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనిని పొడిగించింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications