For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వ్యాక్సీన్ ఉత్పత్తి పెంచాలంటే.. మేం అందుకు సిద్ధం: భారత్ బయోటెక్ సుచిత్ర

|

కంపెనీల పరస్పర సహకారం, భాగస్వామ్యం, సాంకేతిక బదలీలు, వివిధ కీలక సామాగ్రి, పదార్థాల సరఫరాలు పెరిగినప్పుడే డిమాండ్‌కు తగిన వ్యాక్సీన్ ఉత్పత్తి పెంచడం సాధ్యమవుతుందని భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్ల అన్నారు. శనివారం ఈయూ-ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.

కరోనా వ్యాక్సీన్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడానికి పైవన్నీ చాలా కీలకం అన్నారు. పేటెంట్ల నిబంధనల్లో వెసులుబాటు కల్పించడం ఒక్కటే సరిపోదని, భాగస్వామ్యాలు, టెక్నాలజీ, ముడి పదార్థాల లభ్యత ముఖ్యమని చెప్పారు. అప్పుడే దేశీయ అవసరాలతో పాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సీన్‌ను సరఫరా చేయగలమన్నారు.

అన్ని డోసులు కష్టమే

అన్ని డోసులు కష్టమే

భారత్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ అవసరాలకు భాగస్వామ్యాలు చాలా అవసరమని సుచిత్ర ఎల్లా అన్నారు. అందుకే కొవాగ్జిన్‌ను అమెరికాలో రిజిస్టర్ చేశామని, యూరప్‌లోనూ రిజిస్టర్‌ చేయనున్నామని, యూరోపియన్ యూనియన్‌లోని-EU కంపెనీలు, విద్యాసంస్థలతో చేతులు కలుపుతామని తెలిపారు. తద్వారా అక్కడ కూడా కోవాగ్జిన్ నమోదుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. మన దేశంలో 130 కోట్ల జనాభాకు సరిపడా 260 కోట్ల డోసులను తక్కువ సమయంలో అందించలేమని, 200 కోట్ల డేసులు కూడా వేగంగా ఇవ్వడం ఏ దేశానికి సాధ్యం కాదన్నారు. కానీ ఇప్పుడది అవశ్యమన్నారు.

మేం సిద్ధం

మేం సిద్ధం

తమ ప్లాంట్లలో కొత్త టెక్నాలజీని వినియోగించడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు టెక్నాలజీ బదిలీ అవసరమవుతుందన్నారు. అప్పుడు తక్కువ సమయంలో భారత్‌కే కాదు, ప్రపంచానికి కూడా వ్యాక్సీన్ అందించడానికి సాధ్యమవుతుందన్నారు. ఐరోపా నుండి సరఫరా రాక ఆలస్యమవుతోందని, తాము ఫిర్యాదు చేయడం లేదని, కానీ తాము ఆర్డరు పెట్టేవాటికి వచ్చే వాటికి పొంతన ఉండడం లేదు. దేశంలో టీకా తయారీదార్లకు భారీ మొత్తంలో ముడి పదార్థాల అవసరం ఉంది. ఇపుడు ఐరోపా దేశాల నుంచి సాంకేతికత బదిలీ, టీకా తయారీకి కావలసిన ముడి పదార్థాలు కావాలి. పేటెంట్ల సడలింపుల వల్ల కూడా టీకా తయారీదార్లకు సహాయం చేయవచ్చు.

చేతులు కలిపేందుకు సిద్ధం

చేతులు కలిపేందుకు సిద్ధం

భారత్ బయోటెక్ చేతులు కలపడానికి సిద్ధంగా ఉందని సుచిత్ర ఎల్ల అన్నారు. భాగస్వామ్యాలకు విలువ ఇస్తుందని, గతంలో ఆరు నుండి ఎనిమిది ఉత్పత్తులను తీసుకురావడానికి వివిధ సంస్థలతో కలిసి పని చేసిందని గుర్తు చేశారు. కొవాగ్జిన్ ఉత్పత్తికి అవసరమైన కొన్ని కీలకమైన ఎక్విప్‌మెంట్స్, ముడిపదార్ధాలు ఈయూ నుంచి రావాలన్నారు. వీటికి కొన్ని అడ్డంకులు ఉన్నాయన్నారు.

English summary

కరోనా వ్యాక్సీన్ ఉత్పత్తి పెంచాలంటే.. మేం అందుకు సిద్ధం: భారత్ బయోటెక్ సుచిత్ర | Tech transfers, supply of materials must to scale up vaccine production

Partnerships, technology transfers and supply of various critical equipment and materials which go into the production of COVID-19 vaccines are must for scaling up the production to cater to the huge demand, Bharat Biotech Joint MD Suchitra Ella said on Saturday.
Story first published: Sunday, May 9, 2021, 9:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X