For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Amazon Layoffs: మరో వ్యాపారాన్ని మూసేస్తున్న అమెజాన్.. తాజాగా 9000 మంది లేఆఫ్..

|

Amazon Layoffs: ప్రస్తుతం ఉన్న ఆర్థిక గందరగోళ పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల తగ్గింపులో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవటం లేదు. అవును ఇప్పటి వరకు లేఆఫ్ లకు పరిమితమైన చాలా కంపెనీలు.. ఇటీవల కొన్ని వ్యాపార విభాగాలను సైతం మూసివేస్తున్నాయి.

మార్చిలో రెండవ రౌండ్ తొలగింపుల్లో భాగంగా ప్రపంచ టెక్, ఈ-షాపింగ్ దిగ్గజం అమెజాన్ 9000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్, మానవ వనరుల విభాగంలో కొంతమంది ఉద్యోగులను బుధవారం తొలగించింది. ప్రస్తుతం కంపెనీ కష్టమైన రోజులను చూస్తోందంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ CEO ఆడమ్ సెలిప్‌స్కీ, హెచ్ఆర్ హెడ్ బెత్ గలెట్టి ఉద్యోగులకు పంపిన సందేశంలో వెల్లడించారు.

Tech Jaint Amazon shutting its Halo business unit along with big layoffs, Know details

అమెజాన్ తన 29 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల తొలగింపులను చూస్తోంది. గత వారం అడ్వర్టైజింగ్ యూనిట్‌లోని కొంతమంది ఉద్యోగులను తొలగించగా.. దీనికి ముందు వీడియో గేమ్, ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ యూనిట్లలోనూ ఉద్యోగులను తొలగించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ వివిధ విభాగాల్లో దాదాపు 18,000 ఉద్యోగులను తొలగించింది. వ్యాపార విస్తరణ, ప్రయోగాత్మక ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేసింది.

దీనికి తోడు తాజాగా అమెజాన్ తన వ్యాపార విభాగాన్ని మూసివేయాలని నిర్ణయించింది. హెల్త్ & స్లీప్ ట్రాకర్లను విక్రయించే హాలో విభాగాన్ని బుధవారం మూసివేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. టెక్నాలజీ దిగ్గజం విస్తృత కంపెనీల తొలగింపులను ప్రారంభించినందున ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కంపెనీ జూలై 31 నుంచి Halo సేవలకు మద్దతును నిలిపివేయటంతో పాటు.. గడచిన 12 నెలల్లో వీటిని కొనుగోలు చేసిన వారికి పూర్తి మెుత్తాన్ని తిరిగి చెల్లిస్తామని కంపెనీ వెల్లడించింది.

Read more about: amazon layoffs
English summary

Amazon Layoffs: మరో వ్యాపారాన్ని మూసేస్తున్న అమెజాన్.. తాజాగా 9000 మంది లేఆఫ్.. | Tech Jaint Amazon shutting its Halo business unit along with big layoffs, Know details

Tech Jaint Amazon shutting its Halo business unit along with big layoffs, Know details
Story first published: Thursday, April 27, 2023, 9:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X