TCS సరికొత్త రికార్డ్: రిలయన్స్‌ను దాటివేసే స్పీడ్‌తో ...
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) సరికొత్త రికార్డుకు చేరుకుంది. గతంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.15 లక్షల కోట్లను దాటి, రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ రూ.10 లక్షల కోట్ల దిగువన ఉంది. కానీ ఈ రెండు మూడు నెలల కాలంలో అంతా తారుమారైంది! రిలయన్స్ స్టాక్ అంతకంతకూ పడిపోగా, టీసీఎస్ షేర్ ధర అంతకంతకూ పెరిగింది. ఇప్పుడు రిలయన్స్‌కు టీసీఎస్ అతి చేరువలో ఉంది.
నూనె ధరలు ప్రభావం, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయ్!

నేడు మరింత ఎగబాకిన స్టాక్
టీసీఎస్ షేర్ ధర ఈ రోజు ఓ సమయంలో 3.5 శాతం ఎగబాకి రూ.3,230ని తాకింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారి రూ.12 లక్షల కోట్లను దాటింది. ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఈ మార్కు దాటిన రెండో కంపెనీ టీసీఎస్ మాత్రమే. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉన్నాయి. జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లోని రూ.7,504 కోట్లతో పోలిస్తే కంపెనీ నికర లాభం 7 శాతానికి పైగా పెరిగి రూ.8,727 కోట్లకు చేరుకుంది. అంతకుముందే దూకుడు మీద ఉన్న ఈ స్టాక్ మొన్న ఫలితాలు మెరుగ్గా ఉండటంతో నేడు మరింత ఎగబాకింది. టీసీఎస్ దూకుడు ఇలాగే కొనసాగి, రిలయన్స్ పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వారం రిలయన్స్ మార్కెట్ క్యాప్‌ను దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఐటీ స్టాక్స్ అదుర్స్
ట్రేడింగ్ సమయంలో టీసీఎస్ షేర్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీంతో సోమవారం టీసీఎస్ ఎం-క్యాప్ రూ.12 లక్షల కోట్లు దాటింది. ఐటీ స్టాక్స్ ఇటీవల జంప్ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ షేర్ రూ.1,365.95, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ రూ.1,029, విప్రో రూ.445, మైండ్‌ట్రీ రూ.1,764.50, టెక్ మహీంద్రా రూ.1,068.65 వద్ద ఉన్నాయి.

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్
బీఎస్ఈ లిస్టెట్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,96,56,811.32 కోట్లుగా ఉంది. టాప్ 10లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1202591.90 కోట్లు, టీసీఎస్ రూ.191400.91 కోట్లు, HDFC బ్యాంకు రూ.799050.87 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.586161.88 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.570577.99 కోట్లు, HDFC రూ.495349.91 కోట్లు, కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.383985.12 కోట్లు, ICICI బ్యాంకు రూ.376083.39 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 300338.57 కోట్లు, భారతీ ఎయిర్ టెల్ రూ.298473.54 కోట్లుగా ఉంది.