For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ కాలర్ ఉద్యోగులకు టాటా స్టీల్ కొత్త వర్కింగ్ మోడల్

|

కరోనా మహమ్మారి కారణంగా ఐటీ కంపెనీల నుండి వివిధ రంగాల్లో ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ వైరస్ దెబ్బతో దేశీయ, అంతర్జాతీయ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటును కల్పించాయి. టాటా గ్రూప్‌కు చెందిన టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల్లో 75 శాతం మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. ఇదే గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ వైట్ కాలర్ ఉద్యోగులకు కూడా ఈ కంపెనీ ఓ వెసులుబాటు కల్పించింది. కొత్త వర్కింగ్ మోడల్‌ను తెచ్చింది.

డిస్కౌంట్, స్టాంప్ డ్యూటీ తగ్గింపు, పండుగ: ఆ సిటీలో రియాల్టీ జోరు, హైదరాబాద్ ఖరీదు!డిస్కౌంట్, స్టాంప్ డ్యూటీ తగ్గింపు, పండుగ: ఆ సిటీలో రియాల్టీ జోరు, హైదరాబాద్ ఖరీదు!

ఏడాది మొత్తం ఇంటి నుండి పని

ఏడాది మొత్తం ఇంటి నుండి పని

కరోనా వ్యాప్తి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. కంపెనీలు, కార్యాలయాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయిస్తున్నాయి. ఈ వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని టాటా స్టీల్ కొత్త వర్కింగ్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఉద్యోగులకు ఏడాది మొత్తం ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఇచ్చింది. నవంబర్ నెల నుంచి ఇది అమల్లోకి వచ్చేలా కొత్త వర్కింగ్ మోడల్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. నవంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చే కొత్త మోడల్ ప్రకారం ఒక నిర్దిష్ట ప్రదేశం నుండి బయటికి రావాల్సిన అధికారులు కూడా ఇప్పుడు ఇంటి నుండే ఏడాది మొత్తం పని చేయవచ్చు.

వర్క్ ఫ్రమ్ ఎనీవేర్

వర్క్ ఫ్రమ్ ఎనీవేర్

అలాగే ఉద్యోగులకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం నుండి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వెసులుబాటు కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం 10 శాతం మంది టాటా స్టీల్ ఉద్యోగులకు ఈ వర్కింగ్ రిమోట్ వెసులుబాటును కల్పించనుంది. ఆ తర్వాత 30 శాతం మందికి పెంచనుంది. టాటా స్టీల్‌లో 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 55,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు జమ్‌షెడ్‌పూర్(జార్ఖండ్), కళింగనగర్(ఒడిశా)తో పాటు గమారియా, సెరాయికేలా-కార్స్వాన్, ఆంగుల్‌లో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వల్ల తల్లిదండ్రులు, కుటుంబంతో కలిసి సౌకర్యవంతమైన పని ప్రదేశాలను ఎంచుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.

ఎక్కడి నుండైనా పని చేయించే అవకాశం

ఎక్కడి నుండైనా పని చేయించే అవకాశం

తమ ఉద్యోగులతో ఎక్కడి నుండైనా పనిచేయించే అవకాశాలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సంపూర్ణ పని ప్రయోజనాలకు అలవాటుపడుతున్న సమయంలో వాస్తవానికి ఏ ప్రదేశం నుండైనా పని చేయగల ఉద్యోగులను చూడవచ్చునని, యంత్రాలు, మిల్లులను రిమోట్‌గా నిర్వహించే లక్ష్యంతో ప్రజలను డిజిటల్‌గా ఎనేబుల్ చేసే ప్రక్రియలో ఉన్నామని టాటా స్టీల్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. వేతన నిర్మాణం, డెలివరీ లేదా ఎక్కువ సౌలభ్యాన్ని అనుభవిస్తున్న ఉద్యోగులకు సంబంధించి సమస్యలు పెరగడం వంటి వాటిపై కంపెనీ దృష్టి సారిస్తోంది.

English summary

వైట్ కాలర్ ఉద్యోగులకు టాటా స్టీల్ కొత్త వర్కింగ్ మోడల్ | Tata Steel's work from anywhere for white collar employees

As COVID-19 cases continue to rise, Tata Steel is planning to issue an advisory to shift some of its employees from work from home mode to work-from-anywhere to ensure their health and safety. The decision is likely to be rolled out this month that will allow a large section of the steel maker's white collar employees to work from any part of the country.
Story first published: Tuesday, November 3, 2020, 9:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X