కరోనా వైరస్ లక్షలాది ప్రాణాలను తీసుకెళ్లి, వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. చాలా కుటుంబాలకు ఆర్థికంగా పెద్దదిక్కుగా ఉన్నవారిని తీసుకెళ్లింది. ఇది ఆ కుటుంబాలను చీకట్లోకి నెట్టివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ దిగ్గజం టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన తన ఉద్యోగస్తుల కుటుంబానికి సామాజిక భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి, ఆ ఉద్యోగి రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు ప్రతి నెల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి వేతనం
టాటా స్టీల్ ఔదార్యం అందరి మన్ననలు పొందుతోంది. సోషల్ మీడియాలో రతన్ టాటా పైన ప్రశంసలు కురుస్తున్నాయి. ఎవరైనా ఉద్యోగి కరోనాతో మృతి చెందితే ఆ ఉద్యోగి తన చివరి నెల వేతన రూపంలో తీసుకున్న మొత్తాన్ని ఆ కుటుంబానికి ప్రతి నెల అందించనున్నట్లు ప్రకటించింది. సామాజిక మాద్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా టాటా స్టీల్ తన నిర్ణయాన్ని తెలిపింది.

ఫ్రంట్ లైన్ వర్కర్లకు అదనపు సాయం
టాటా స్టీల్ కంపెనీలో పని చేస్తూ కరోనాతో మరణించిన ఫ్రంట్ లైన్ ఉద్యోగులు లేదా వర్కర్ల పిల్లల చదువులకు ఖర్చులు కంపెనీయే భరిస్తుంది. వారిని గ్రాడ్యుయేషన్ వరకు చదివిస్తుంది. వీరికి నెల శాలరీ అందించడంతో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబాలకు ఈ అదనపు సాయం కల్పించనున్నట్లు ప్రకటించింది. జంషెడ్‌పూర్ కేంద్రంగా పని చేస్తోన్న టాటా స్టీల్ ఔదార్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అదే మద్దతు
తమ కంపెనీలోని ఉద్యోగులు కరోనాతో మృతి చెందడం పట్ల కలత చెందుతున్నామని, వారి కుటుంబానికి అండగా నిలుస్తామని టాటా స్టీల్ పేర్కొంది. ఉద్యోగి తీసుకున్న చివరి వేతనాన్ని, సదరు మృతి చెందిన ఉద్యోగి రిటైర్మెంట్ వయస్సు 60 వచ్చే వరకు అందిస్తామని తెలిపింది. స్టేక్ హోల్డర్లకు కంపెనీ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని పేర్కొంది. ఈసారి కూడా అదే కొనసాగిస్తున్నామని వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications