For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ రుణ మార్కెట్ల వైపు టాటా సన్స్ చూపు- రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి ?

|

ఈ ఆర్ధిక సంవత్సరంలో నిధుల కొరతతో సతమతం అవుతున్న టాటా సన్స్ తమ ఆస్తుల అమ్మకానికి సిద్ధం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ సాగుతోందని తేలిపోయింది. తాజాగా టాటా సన్స్ విదేశీ అప్పుల కోసం ప్రయత్నాలు చేసే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. సంస్ధలో దీనిపై చర్చలు జరుగుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

 టాటా సన్స్ కు నిధుల కొరత...

టాటా సన్స్ కు నిధుల కొరత...

దేశంలోని అతి పెద్ద ప్రైవేటు రంగ సంస్ధల్లో ఒకటైన టాటా సన్స్ ఈ ఆర్ధిక సంవత్సరంలో నిధుల కొరతను అధిగమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సంస్ధకు చెందిన కొన్ని ఆస్తులను విక్రయించే అవకాశం ఉందని తొలుత ఊహాగానాలు వచ్చాయి. అయితే టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. టాటా సన్స్ ఆర్ధికంగా పరిపుష్టంగానే ఉందని, గ్రూపులోని కొన్ని సంస్ధలకు చేయూతనిచ్చేందుకు, కొత్త ప్రాజెక్టులను అమలు చేసేందుకు మాత్రమే నిధులు అవసరమవుతాయని గత వారం స్పష్టం చేశారు. అయితే వీటి కోసం అయినా నిధులు తప్పనిసరి కావడంతో టాటా సన్స్ ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

 విదేశీ రుణాలవైపు చూపు...

విదేశీ రుణాలవైపు చూపు...

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో మిగిలిన సంస్ధల తరహాలోనే టాటా సన్స్ తో పాటు గ్రూపు సంస్ధలు ఆర్ధికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఛైర్మన్ చంద్రశేఖరన్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో ఆస్తులు అమ్మకుండా విదేశీ నిధుల సేకరణకు వెళ్లాలని టాటా సన్స్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విదేశీ బ్యాంకుల నుంచి నిధుల సేకరణకు టాటా సన్స్ మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత మొత్తం నిధులు సేకరించబోతున్నారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.

 రెండేళ్ల వ్యవధిలో మరోసారి...

రెండేళ్ల వ్యవధిలో మరోసారి...

టాటా సన్స్ ప్రైవేటు రంగంలోకి మారాక 2018 ఆర్ధిక సంవత్సరంలో టాటా సన్స్ తొలిసారిగా విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. అప్పట్లో 1.5 బిలియన్ డాలర్లను రుణాల రూపంలో టాటా సన్స్ సేకరించింది. ఈసారి కూడా దాదాపు అంతే మొత్తం లేదా అంత కంటే కాస్త ఎక్కువగానే రుణాలు సేకరించే అవకాశముందని విదేశీ బ్యాంకుల వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీన్ని ఇంకా కంపెనీ వర్గాలు ధృవీకరించలేదు. అయితే విదేశీ రుణ సేకరణ ఆప్షన్ మాత్రం పరిశీలనలో ఉందని క్లారిటీ ఇస్తున్నారు.

COVID 19: 100ఏళ్లలో చూడలేని మాంద్యం, అదే జరిగితే భారత ఆర్థిక పరిస్థితి ఊహించడమే కష్టంCOVID 19: 100ఏళ్లలో చూడలేని మాంద్యం, అదే జరిగితే భారత ఆర్థిక పరిస్థితి ఊహించడమే కష్టం

English summary

విదేశీ రుణ మార్కెట్ల వైపు టాటా సన్స్ చూపు- రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి ? | Tata Sons may dip into overseas debt markets to meet fund requirements

The size of the international fund offering has not been decided as yet and it is one of the options on the table, said a banker close to the development
Story first published: Thursday, June 11, 2020, 14:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X