For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా డిజిటల్‌కు భారీగా పెట్టుబడులు.. ఓకేసారి 5 వేల కోట్లు, వాటి పోటీ తట్టుకునేందుకే..?

|

దేశీయ దిగ్గజ కంపెనీ టాటా.. ఈ కామర్స్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే టాటాకు ఈ కామర్స్ సైట్లు ఉన్నాయి. తాజాగా కొత్తగా మరో యాప్ ఓపెన్ చేశారు. దానిని మరింత డెవలప్ చేయడంపై కంపెనీ ఫోకస్ చేసింది. ఇందుకోసం భారీగా పెట్టుబడి పెట్టింది. టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. రూ. 5,882 కోట్లను ఒకే ట్రాన్సాక్షన్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేసింది. 2021-22 లో టాటా డిజిటల్‌‌‌‌లో మొత్తం రూ. 11,872 కోట్లను ​ టాటా సన్స్ ఇన్వెస్ట్ చేసింది.

టాటా సన్స్ ఈ-కామర్స్​ కంపెనీలో ఒక వార్షిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి. టాటా డిజిటల్‌‌‌‌ తాజాగా టాటా న్యూ యాప్‌‌‌‌ను తీసుకొచ్చింది. క్రోమా, టాటా క్లిక్‌‌‌‌, బిగ్‌‌‌‌బాస్కెట్‌‌‌‌, 1ఎంజీ వంటి కంపెనీలు ఈ కంపెనీకి సబ్సిడరీలుగా ఉంటాయి. టాటా సన్స్‌‌‌‌కు రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న రూ. 5,882 కోట్ల విలువైన ఫుల్లీ పెయిడప్‌‌‌‌ ఈక్విటీ షేర్లను ఇష్యూ చేయడానికి టాటా డిజిటల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నెల 7వ తేదీన టాటా న్యూ యాప్‌‌‌‌ను కంపెనీ తీసుకొచ్చింది.

tata sons invests 5882 crore to tata digital

2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ.5,990 కోట్లను టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్స్ ఇన్వెస్ట్ చేసింది. మార్చి 31వ తేదీ నాటికి ఉన్న సమాచారం మేరకు టాటా డిజిటల్‌‌‌‌ ఆథరైజ్డ్ క్యాపిటల్‌‌‌‌ను రూ. 11,000 నుంచి రూ. 15,000 కోట్లకు పెంచింది. టాటా డిజిటల్‌‌‌‌కు ఉన్న అప్పులను తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు ఈ క్యాపిటల్‌‌‌‌ను వాడతారు.

ఒకే సారి రూ. 5,882 కోట్లను టాటా డిజిటల్‌‌‌‌లో టాటా సన్‌‌‌‌ ఇన్వెస్ట్ చేసింది. ఈ కంపెనీ ఏర్పడినప్పటి నుంచి చేసిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లలో ఇది సగం కావడం విశేషం అని అల్టో ఇన్ఫో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ మోహిత్ యాదవ్‌‌‌‌ అన్నారు. ఈ-కామర్స్‌‌ సెగ్మెంట్‌‌పై సీరియస్‌‌గా ఉన్నామనే సంకేతాలను టాటా గ్రూప్‌‌ ఇస్తోంది. సో మరీ ప్లిప్ కార్డ్, అమెజాన్.. ఇటీవల వచ్చిన ఎస్ షాప్, మీ షో లాంటి ఈ కామర్స్ నుంచి పోటీ ఎలా తట్టుకుంటుందో చూడాలీ మరీ.

English summary

టాటా డిజిటల్‌కు భారీగా పెట్టుబడులు.. ఓకేసారి 5 వేల కోట్లు, వాటి పోటీ తట్టుకునేందుకే..? | tata sons invests 5882 crore to tata digital

tata sons invests 5882 crore to tata digital. for e commerce aap growing.
Story first published: Sunday, April 10, 2022, 16:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X