For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 ఏళ్ల గరిష్టానికి టాటా మోటార్స్ సేల్స్, వాహనాల సేల్స్ భారీగా జంప్

|

2021 ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. టాటా మోటార్స్, మారుతీ, అశోక్ లేలాండ్ సహా వివిధ సంస్థల విక్రయాలు జంప్ చేశాయి. టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్ సేల్స్ 9 ఏళ్లలోనే గరిష్టాన్ని నమోదు చేయగా, బజాజ్ ఆటో సేల్స్ ఆరు శాతం పెరిగాయి. డొమెస్టిక్ మార్కెట్లో టాటా మోటార్స్ వ్యాపారం 54 శాతానికి పెరిగింది. దీనికి తోడు 107 నెలలు లేదా 9 సంవత్సరాల్లో మొదటసారి రికార్డ్ స్థాయిలో పాసింజర్ సేల్స్ నమోదు చేసుకుంది. డొమెస్టిక్ మార్కెట్లో పాసింజర్ వెహికిల్ సేల్స్ ఫిబ్రవరిలో 119 శాతం పెరిగింది.

టాటా మోటార్స్ అదుర్స్

టాటా మోటార్స్ అదుర్స్

టాటా మోటార్స్ డొమెస్టిక్ సేల్స్ ఫిబ్రవరిలో 58,473గా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 38,002 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 54 శాతం వృద్ధిని నమోదు చేసింది. పాసింజర్ వెహికిల్ సేల్స్ 2020 ఫిబ్రవరిలో 12,430 యూనిట్ల నుండి ఈ ఫిబ్రవరిలో 27,225 యూనిట్లకు పెరిగాయి. ఇందులో టాటా మోటార్స్ కరెంట్ జనరేషన్ మోడల్స్ టాటా హారియర్, ఆల్ట్రోజ్, నెగ్జాన్ ఉన్నాయి. వీటి సేల్స్ 119 శాతం పెరిగింది. కమర్షియల్ వెహికిల్ సేల్స్‌కు మంచి డిమాండ్ వచ్చింది. టాటా కమర్షియల్ వెహికిల్ సేల్స్ 22 శాతం ఎగిసి 31,248 యూనిట్లుగా నమోదయ్యాయి.

బజాజ్ ఆటో సేల్స్

బజాజ్ ఆటో సేల్స్

బజాజ్ ఆటో సేల్స్ 6 శాతం పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 3,54,913 యూనిట్లు కాగా, ఈసారి 3,75,017 యూనిట్లకు పెరిగాయి. డొమెస్టిక్ సేల్స్ మాత్రం 2 శాతం క్షీణించాయి. 2020లో ఫిబ్రవరిలో భారత్‌లో 1,68,747 యూనిట్లు అమ్ముడు కాగా, ఈసారి 1,64,811 యూనిట్లకు పడిపోయింది. ఇక బజాజ్ బైక్స్ వాహన విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదయింది. గత ఏడాది ఫిబ్రవరిలో 3,10,222 యూనిట్లు సేల్ కాగా, ఈసారి 3,32,563 యూనిట్లకు పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 5 శాతం తగ్గాయి. 2020 ఫిబ్రవరిలో 44,691 యూనిట్లను విక్రయించగా ఈ ఫిబ్రవరిలో 42,454కు తగ్గింది. ఎగుమతులు 1,86,166 యూనిట్ల నుండి 13 శాతం పెరిగి 2,10,206 యూనిట్లకు పెరిగాయి.

మారుతీ సుజుకీ సహా..

మారుతీ సుజుకీ సహా..

మారుతీ సుజుకీ సేల్స్ 11.8 శాతం పెరిగాయి. మినీ కార్లు ఎస్ ప్రెస్పో, ఆల్టో సేల్స్ 12.9 శాతం క్షీణించాయి. కాంపాక్ట్ సెగ్మెంట్ కారు సేల్స్ 15.3 శాతం పెరిగాయి. యుటిలిటీ వెహికిల్ విబాగంలో 18.9 శాతం పెరిగాయి. ఎగుమతులు 12 శాతం వరకు పెరిగాయి.

టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ 36 శాతం పెరిగాయి ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ మూడు రెట్లు పెరిగాయి. అశోక్ లేలాండ్ సేల్స్ 19 శాతం, హ్యుండాయ్ సేల్స్ 26.4 శాతం పెరిగాయి.

English summary

9 ఏళ్ల గరిష్టానికి టాటా మోటార్స్ సేల్స్, వాహనాల సేల్స్ భారీగా జంప్ | Tata Motors reports highest PV sales in 9 years, Maruti outperform street expectations

Tata Motors has released its vehicle sales data for February 2021. Tata Motors Limited is one of the few automakers that releases retail data instead of wholesale numbers which is considered the industry standard.
Story first published: Monday, March 1, 2021, 20:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X