For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..

|

ఇది ఈ-కామర్స్ కాలం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది వేగంగా వృద్ధి సాధిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే అమెజాన్, ఇటీవలి కాలంలో వాటికి పోటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకొచ్చాయి. కాలానికి అనుగుణంగా టాటా గ్రూప్ కూడా సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది. టాటా ఉప్పు నుండి టీసీఎస్ వరకు వివిధ రంగాల్లో విస్తరించింది టాటా గ్రూప్. గత ఏడాది టాటా డిజిటల్ పేరుతో డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించింది. తాజాగా, చైనాలో ప్రాచుర్యం పొందిన టె్సెంట్, అలీబాబా తరహాలో సూపర్ యాప్ తీసుకువస్తోంది.

ఆపిల్ కీలక నిర్ణయం: ఇండియాలో iPhone 12 ఉత్పత్తి, బెంగళూరులో 10,000 ఉద్యోగాలుఆపిల్ కీలక నిర్ణయం: ఇండియాలో iPhone 12 ఉత్పత్తి, బెంగళూరులో 10,000 ఉద్యోగాలు

డిసెంబర్ లేదా జనవరి నాటికి సూపర్ యాప్

డిసెంబర్ లేదా జనవరి నాటికి సూపర్ యాప్

టాటా గ్రూప్ సూపర్ యాప్ ఈ డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి అందుబాటులోకి రానుంది. తద్వారా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్, ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ వంటి సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి. ఈ యాప్‌ను సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

ఈ సేవలన్నీ అందుబాటులో...

ఈ సేవలన్నీ అందుబాటులో...

ఈ సూపర్ యాప్ ద్వారా ప్రతి వస్తువు ఆర్డర్ చేసేలా ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు లేవు. ఫ్యాషన్ షాపింగ్ యాప్ టాటా క్లిక్, కిరాణా ఈ-స్టోర్ స్టార్ క్విక్ ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్స్ ప్లాట్‌ఫాం క్రోమా ద్వారా ఇప్పటికే సేవలు అందిస్తోంది టాటా గ్రూప్. వీటన్నింటి సమ్మిళితంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ సరికొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుడ్, కిరణా, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్సురెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ వంటి వాటితో పాటు ఇతర పేమెంట్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకు రానుందని తెలుస్తోంది.

సూపర్ యాప్.. ఎన్నో యాప్స్

సూపర్ యాప్.. ఎన్నో యాప్స్

ఇది సూపర్ యాప్ అని, ఇందులో పలు యాప్స్ ఉంటాయని, డిజిటల్ సేవల్లో తమకు అపార అవకాశాలున్నాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. దేశంలో కోట్లాదిమంది వినియోగదారులను అనుసంధానిస్తూ వారికి సరళమైన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించనున్నట్లు చెప్పారు. కాగా, గోల్డ్‌మన్ సాక్స్ ప్రకారం దేశంలో 2030 నాటికి భారత జీడీపీలో 2.5శాతం వాటా ఆన్‌లైన్ రిటైల్ విభాగానిది ఉండనుంది. 15 రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

English summary

రిలయన్స్, అమెజాన్‌కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో.. | Tata Group to launch super app covering range of digital services

India’s Tata Group is pushing into the country’s booming tech sector with a new “super app” that will bring together its disparate consumer services for the first time.
Story first published: Monday, August 24, 2020, 13:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X