For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

TataMD CHECK: టాటా కరోనా టెస్ట్ కిట్, 90 నిమిషాల్లోనే ఫలితం

|

టాటా గ్రూప్‌కు చెందిన టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ (టాటా ఎండీ) సరికొత్త కరోనా టెస్టింగ్ పరికరాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న కరోనా టెస్టింగ్ టూల్స్‌తో పోలిస్తే ఇది మరింత సామర్థ్యం కలిగినదని కంపెనీ తెలిపింది. టాటా గ్రూప్ కోవిడ్ 19ను త్వరగా గుర్తించే కిట్‌ను సోమవారం ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 90 నిమిషాల్లోనే కరోనా వైరస్ ఉనికిని గుర్తించవచ్చునని టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ లిమిటెడ్ తెలిపింది.

2 లక్షల కొత్త ఉద్యోగాలు: జోబిడెన్‌తో కలిసి పని చేసేందుకు భారత ఐటీ పరిశ్రమ రెడీ2 లక్షల కొత్త ఉద్యోగాలు: జోబిడెన్‌తో కలిసి పని చేసేందుకు భారత ఐటీ పరిశ్రమ రెడీ

టాటా ఎండీ చెక్

టాటా ఎండీ చెక్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలాజీతో (సీఎస్ఐఆర్-ఐజీఐబీ) కలిసి టాటా ఎండీ చెక్ (TataMD CHECK) కిట్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) నుండి ఈ పరీక్షలకు అనుమతులు వచ్చాయి. దేశంలోని డయోగ్నస్టిక్ కేంద్రాలు, హాస్పిటల్స్‌లో వంద రోజుల్లో ఈ పరికరాలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

10 లక్షల కిట్లు

10 లక్షల కిట్లు

చెన్నై ప్లాంటులో నెలకు 10 లక్షల కిట్లను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాటా గ్రూప్ తెలిపింది. దేశవ్యాప్తంగా పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో దీనిని ఆవిష్కరించినట్లు కంపెనీ సీఈవో గిరీష్ కృష్ణమూర్తి తెలిపారు. డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణను అందుబాటులోక తెచ్చేందుకు వివిధ ఆసుపత్రులు, వివిధ డయోగ్నస్టిక్ సెంటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతంఉన్న పరికరాలతో.. కొన్ని నమూనాలు ఒకేసారి పరీక్షించాల్సి ఉండగా, ఈ పరికరంతో అలాంటి షరతులు లేవన్నారు. అందుకే సాధ్యమైనంత వేగంగా నిర్ధారణ ఫలితం ఉంటుందన్నారు.

పెద్దగా ఖర్చులు, పరికరాలు అవసరంలేదు

పెద్దగా ఖర్చులు, పరికరాలు అవసరంలేదు

టాటా ఎండీ చెక్ ద్వారా పరీక్షించేందుకు పెద్దగా ఖర్చులు, పరికరాలు అవసరం లేదని గిరీష్ కృష్ణమూర్తి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఆధారంగా ఈ కిట్ పని చేస్తుందన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కేసులు 8.6 లక్షలకు చేరుకున్నాయి. మొత్తం మరణాలు 127,104గా నమోదయ్యాయి. కరోనా కేసుల్లో 10.4 లక్షలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా, భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్, అర్జెంటీనా, యూకే, కొలంబియా, మెక్సికో టాప్ 10లో ఉన్నాయి.

English summary

TataMD CHECK: టాటా కరోనా టెస్ట్ కిట్, 90 నిమిషాల్లోనే ఫలితం | Tata Group launches faster Covid-19 test kits

Tata Group launched a COVID-19 test kit on Monday that it says will process results more easily and faster than the RT-PCR method considered the gold standard for detection, at a time when cases are still rising in the country.
Story first published: Tuesday, November 10, 2020, 10:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X