For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Apple-Tata: టాటా గ్రూప్ చేతిలో ఆపిల్ స్టోర్స్.. దేశవ్యాప్తంగా 100 ఔట్ లెట్స్..

|

Apple-Tata: రిటైల్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో టాటాలది పెద్ద ప్రస్థానం. ఈ రంగంలో క్రోమా పేరుతో ఇప్పటికే టాటాలు జౌట్ లెట్లను దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఇన్ఫినిటీ రిటైల్ వీటిని నిర్వహిస్తోంది.

తాజాగా ఇన్ఫినిటీ రిటైల్ ఆపిల్ ఫ్రాంఛైజీ భాగస్వామిగా మారుతోంది. దీని వల్ల ఆపిల్ ఉత్పత్తులను మాత్రమే విక్రయించేందుకు వీలుగా టాటా గ్రూప్ 100 ప్రత్యేక స్టోర్లను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఆపిల్ అధీకృత స్టోర్లను మాల్స్, అప్ మార్కెట్ ప్రదేశాల్లో ఒక్కొక్కటి 500 నుంచి 600 చదరపు అడుగుల ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దుకాణాలు Apple Premium పునఃవిక్రేత దుకాణాల కంటే చిన్నవిగా ఉండనున్నాయి. ఈ స్టోర్లలో ఎక్కువగా iPhoneలు, iPadలు, ఆపిల్ వాచ్ లను విక్రయిస్తారని సమాచారం. మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్ మార్చి త్రైమాసికంలో ముంబైలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి.

 Tata group going to open 100 small apple stores across india in upmarkets and malls

ఇదే క్రమంలో ఆపిల్ తన మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ల అవుట్‌పుట్‌ను మూడు రెట్లు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనాలో కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు వికటించి వ్యాపార వర్గాలను నష్టాల్లోకి నెట్టిన సందర్భంలో ఆపిల్ తన తయారీని తమిళనాడు కేంద్రంగా పెంచాలని చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ ప్రభావానికి కంపెనీ తన స్థానిక సరఫరాదారులైన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్‌లకు తయారీ సామర్థ్యాలను పెంచాలంటూ ఇప్పటికే కోరింది. తయారీని పెంచడానికి మరిన్ని అసెంబ్లింగ్ లైన్‌లు, ఉద్యోగులను ఇప్పటికే జోడించింది. ఇది రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను మనదేశంలో తయారు చేసి ఎగుమతి చేసేందుకు కేంద్రంగా మారేందుకు దోహదపడుతోంది. అయితే ఈ అవకాశాన్ని టాటాలు రెండు వైపులా(తయారీ, విక్రయం) అందిపుచ్చుకుంటున్నారు.

English summary

Apple-Tata: టాటా గ్రూప్ చేతిలో ఆపిల్ స్టోర్స్.. దేశవ్యాప్తంగా 100 ఔట్ లెట్స్.. | Tata group going to open 100 small apple stores across india in upmarkets and malls

Tata group going to open 100 small apple stores across india in upmarkets and malls
Story first published: Monday, December 12, 2022, 13:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X