For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోకియా కంపెనీకి కరోనా షాక్: 42 మందికి పాజిటివ్, తమిళనాడు ప్లాంట్ మూసివేత

|

తమిళనాడులో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్ర తర్వాత అత్యదిక కేసులు తమిళనాడులో నమోదవుతున్నాయి. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 646 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 17,728కి చేరుకున్నాయి. మరణాలు 127 నమోదయ్యాయి. కరోనా కారణంగా శ్రీపెరుంబదూర్‌లోని నోకియా ప్లాంట్ మూసివేశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది.

కంపెనీలో 42 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ప్లాంటును మూసివేస్తున్నట్లు నోకియా ప్రకటించింది. ఇటీవలి వరకు లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో మూతబడింది. కొద్ది రోజుల క్రితం ఆంక్షలు ఎత్తివేయడంతో తెరుచుకుంది.

 Tamil Nadu plant shut by Nokia, After 42 test positive

గానీ అంతలోనే ప్లాంటులో పెద్ద మొత్తంలో కేసులు బయటపడటంతో తిరిగి మూతబడింది. ప్లాంటును మూసివేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నోకియా ప్లాంట్ జాగ్రత్తలు కూడా తీసుకుంది. సామాజిక దూరం పాటించడం, క్యాంటీన్ సౌకర్యాల్లో మార్పులు వంటి చర్యలు చేపట్టింది.

నిత్యావసరాల్లోకి ల్యాప్‌టాప్.. సేల్స్ డబుల్, ఎందుకంటే: 40 శాతం వరకు డిస్కౌంట్నిత్యావసరాల్లోకి ల్యాప్‌టాప్.. సేల్స్ డబుల్, ఎందుకంటే: 40 శాతం వరకు డిస్కౌంట్

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ శివారులోని ఒప్పో మొబైల్ కంపెనీలో తొమ్మిది మందికి వైరస్ సోకింది. దీంతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత ఆఫీసుల్లో పని చేసేందుకు వచ్చే వ్యక్తుల్లో వైరస్ బయటపడుతోంది. దీనిని ఎదుర్కోవడం కంపెనీలకు సవాల్‌గా మారింది.

English summary

నోకియా కంపెనీకి కరోనా షాక్: 42 మందికి పాజిటివ్, తమిళనాడు ప్లాంట్ మూసివేత | Tamil Nadu plant shut by Nokia, After 42 test positive

Nokia last week suspended operations at a telecoms gear manufacturing plant in southern India, the company said on Tuesday, after some employees tested positive for COVID-19.
Story first published: Wednesday, May 27, 2020, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X