For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనిల్ అంబానీకి ఝలక్, స్విస్ ఖాతా వివరాలు ఇచ్చేందుకు సిద్ధం

|

ముఖేష్ అంబానీ సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి షాక్ తగిలింది. అనిల్ అంబానీతో పాటు టీనా అంబానీ, కుమారులు జై అన్‌మోల్, జై అన్షూల్ స్విస్ బ్యాంకు అకౌంట్ వివరాలను భారత ప్రభుత్వానికి అందించేందుకు స్విస్ బ్యాంకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్విట్జర్లాండ్ ఫెడరల్కోర్టు అంగీకరించినట్లు స్విస్ మీడియా తెలిపింది. పరస్పర సహకారంలో భాగంగా భారత ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన ఫారెన్ ట్యాక్స్ అండ్ రీసెర్చ్ డివిజన్ నుండి వచ్చిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది.

<strong>SBI Salary Account: వివిధ శాలరీ అకౌంట్స్ గురించి తెలుసుకోండి</strong>SBI Salary Account: వివిధ శాలరీ అకౌంట్స్ గురించి తెలుసుకోండి

స్విస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్

స్విస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్

అనిల్ అంబానీ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల వివరాలు పొందేందుకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోని ఫారెన్ టాక్స్, రీసెర్చ్ డివిజన్ కొద్దికాలం క్రితం స్విస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏప్రిల్ 29వ తేదీన కోర్టు ఉత్తర్వులు వెలువడినట్లు స్విస్ పత్రిక గోథమ్ సిటీ తన కథనంలో పేర్కొంది. బహిరంగంగా ఉంచిన కోర్టు ఉత్వరుల్లో అనిల్ అంబానీ కుటుంబం పేర్లను A, B, C, Dగా చూపించారని, ఆ పేర్లు అనిల్, టీనా, అన్‌మోల్, అన్షూల్‌గా కోర్టు రిజిష్ర్టార్ కార్యాలయంలో నిర్ధారించుకున్నట్లు పేర్కొంది.

ఆర్థిక ప్రయోజనాలు

ఆర్థిక ప్రయోజనాలు

ఏప్రిల్ 2011 నుండి 2018 సెప్టెంబర్ వరకు గల అనిల్ అంబానీ, ఆయన కుటుంబ ఆస్తుల వివరాలు కావాలని ఫారెన్ టాక్స్, రీసెర్చ్ డివిజన్ కోరింది. రిలయన్స్ గ్రూప్ అధినేతకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే అంశాలపై పరిశీలన జరిపేందుకు ఈ వివరాలు కావాలని కోరింది.

డబ్బుల్లేవంటూ

డబ్బుల్లేవంటూ

తన వద్ద డబ్బుల్లేవని, తన సోదరుడు ముఖేష్ అంబానీ సాయంతో జీవిస్తున్నట్లు ఇటీవల అనిల్ అంబానీ లండన్ కోర్టుకు విన్నవించారు. చైనా బ్యాంకుల కన్సార్షియం నుంచి అనిల్ కంపెనీలు తీసుకున్న 1,400 కోట్ల డాలర్ల రుణానికి సంబంధించి 77 కోట్ల డాలర్లు చెల్లించాలంటూ లండన్ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అనిల్ ఈ వివరణ ఇచ్చారు. అలాగే అనిల్ గ్రూప్‌లోని మూడు పెద్ద కంపెనీల బ్యాంకు ఖాతాలను ఫ్రాడ్‌గా వర్గీకరించిన ఎస్బీఐ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో కేసులు దాఖలు చేసింది.

English summary

అనిల్ అంబానీకి ఝలక్, స్విస్ ఖాతా వివరాలు ఇచ్చేందుకు సిద్ధం | Swiss bank ordered to share details of Anil Ambani’s accounts with India

The Swiss Federal Court has agreed to share information with Indian authorities regarding the bank accounts of Anil Ambani, Tina Ambani and their two children, Swiss publication Gotham City has reported.
Story first published: Sunday, May 16, 2021, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X