For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్‌ ఇండియాలో మూడు రోజుల సమ్మె ఎఫెక్ట్ ... ఉత్పత్తి ఎంత తగ్గిందంటే

|

ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి చేసే కోల్ ఇండియాలో సమ్మె ప్రభావంతో ఉత్పత్తికి గండి పడింది. మూడు రోజులలో రోజుకు 573,000 టన్నులకు ఉత్పత్తి పడిపోయింది, జూన్ సగటు ఉత్పత్తి రోజుకు 1.29 మిలియన్ టన్నులు కాగా కేవలం 5.73 లక్షల టన్నులకు పడిపోయింది .

గురువారం నుంచి శనివారం వరకు కోల్ ఇండియా కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెలో కంపెనీ రోజువారీ సగటు ఉత్పత్తి 5.73 లక్షల టన్నులకు పడిపోయింది. అంతకు ముందు పది రోజుల సగటు రోజువారీ ఉత్పత్తితో పోలిస్తే ఇది 56 శాతం తక్కువ. వాణిజ్య స్థాయిలో బొగ్గు ఉత్పత్తికి ప్రైవేటు సంస్థలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌ ఇండియా కార్మికులు గత గురువారం నుంచి శనివారం వరకు దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. దీంతో ఉత్పత్తి భారీగా తగ్గింది.

strike effect in Coal India ...cuts output by 56% over 3 days

కరోనా లాక్డౌన్ సమయం నుండి నేటి వరకు కోల్ ఇండియాలో జూన్ నెలలో ఉత్పత్తిలో వరుసగా మూడవ సారి క్షీణత నమోదైంది. 2023, 2024 నాటికి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనుకుంటున్న సంస్థ 2019, 2020 సంవత్సరంలో గత రెండు దశాబ్దాలలో లేనివిధంగా తక్కువ వార్షిక ఉత్పత్తి నమోదు చేసింది. మూడు రోజుల సమ్మె కాలంలో చాలా బొగ్గు గనులలో ఉత్పత్తి లేదు. దీంతో కోల్ ఇండియా ఉత్పత్తికి తాజాగా కార్మికులు చేసిన మూడు రోజుల సమ్మెతో గండి పడింది.

ప్రైవేటు సంస్థలకు బొగ్గు ఉత్పత్తిని అనుమతించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బొగ్గు కార్మికులు మూడు రోజుల దేశవ్యాప్తంగా చేసిన సమ్మె చాలా గనులలో ఉత్పత్తిని దాదాపుగా ఉత్పత్తి చేయలేదని, ఇంధనాన్ని పంపించడం పూర్తిగా నిరోధించబడిందని తెలుస్తుంది .వాణిజ్య బొగ్గు తవ్వకాలను ప్రారంభించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కోల్ ఇండియా (సిఐఎల్) కు చెందిన ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) తో సహా ఐదు కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి.

Read more about: workers business
English summary

కోల్‌ ఇండియాలో మూడు రోజుల సమ్మె ఎఫెక్ట్ ... ఉత్పత్తి ఎంత తగ్గిందంటే | strike effect in Coal India ...cuts output by 56% over 3 days

A strike at Coal India Ltd cut production by 56 per cent in the three days ending July 4 as workers oppose opening up coal mining to the private sector, a senior company official told .
Story first published: Monday, July 6, 2020, 19:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X