For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ ఏడాది కాలంలో అదానీ సహా ఈ స్టాక్స్ దుమ్మురేపాయి

|

ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది కాలంలో మొన్న శుక్రవారం వరకు ఇన్వెస్టర్ల సంపద రూ.27 లక్షల కోట్లు హరించుకుపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. BSE లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2019 మే 30వ తేదీన రూ.154.44 లక్షల కోట్లుగా ఉంటే నిన్న శుక్రవారం నాటికి (మే 29, 2020) 17.7 శాతం తగ్గి రూ.127.06 లక్షల కోట్లుకు పడిపోయింది. ఈ కాలంలో 2,684 యాక్టివ్ స్టాక్స్‌లో 2,308 స్టాక్స్ నష్టాల్లో, 359 స్టాక్స్ పాజిటివ్‌గా ఉండగా ఇందులో 269 స్టాక్స్ (బీఎస్ఈలో 10 శాతం వ్యాల్యూ) మాత్రమే 10 శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి. గత ఏడాది కాలంలో ఇలా లాభపడినవాటిలో టాప్ 5 స్టాక్స్ ఇవే..

మోడీ 2.0: రికార్డ్‌కు ఎగిసి అంతలోనే కుప్పకూలి, ఏడాదిలో రూ.27,00,000 కోట్ల సంపద హుష్‌కాకిమోడీ 2.0: రికార్డ్‌కు ఎగిసి అంతలోనే కుప్పకూలి, ఏడాదిలో రూ.27,00,000 కోట్ల సంపద హుష్‌కాకి

లాభాల్లో ఈ స్టాక్స్

లాభాల్లో ఈ స్టాక్స్

ఈ ఏడాది కాలంలో 5 కంపెనీల షేర్లు పెట్టుబడిదారులకు రెట్టింపు లాభాలను ఇచ్చాయి. ఆ కంపెనీలు అబాట్ ఇండియా, నవీన్ ఫ్లోరిన్, ఆల్కైల్ అమైన్ కెమికల్స్, జీఎంఎం ఫౌడ్లర్, అదానీ గ్రీన్ ఎనర్జీ ఉన్నాయి. టాప్ 20 షేర్లు 50 శాతానికి పైగా ర్యాలీ చేశాయు. ఇందులో ధనుకా అగ్రిటెక్, గ్రాన్యూల్ ఇండియా, అస్ట్రాజెనికా ఫార్మా, ఇప్కా ల్యాబ్స్, దిక్సాన్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఉన్నాయి.

455 శాతం పెరిగిన అదానీ గ్రీన్

455 శాతం పెరిగిన అదానీ గ్రీన్

మే 30 2019 నుండి 29 మే 2020 మధ్య అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 455, జీఎంఎం ఫౌడ్లర్ 180, ఆల్కైల్ అమినీస్ కెమికల్స్ లిమిటెడ్ 144, నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 116, అబోట్ ఇండియా లిమిటెడ్ 113 శాతం పెరిగాయి. ఐసీఐసీఎ సెక్యూరిటీస్, అవెన్యూ సూపర్ మార్కెట్, భారతీ ఎయిర్ టెల్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, నెస్ట్లే ఇండియా, దివిస్ తదితర 20 కంపెనీలు 50 శాతం నుండి 98 శాతం మధ్య పెరిగాయి.

ఈ స్టాక్స్ లాభాలు 50 శాతానికి పైగా..

ఈ స్టాక్స్ లాభాలు 50 శాతానికి పైగా..

20 స్టాక్స్ కూడా ఏడాది కాలంలో 50 శాతానికి పైగా లాభాలు మూటగట్టుకున్నాయి. అయితే గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా భారీగా దెబ్బపడింది. దీంతో మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. జనవరి నెలలో రికార్డ్ 42వేల మార్క్ దాటిన సెన్సెక్స్ ఆ తర్వాత కరోనా కారణంగా కుప్పకూలి పోయింది.

50 శాతానికి పైగా లాభపడ్డ స్టాక్స్‌లో అదానీ గ్రీన్, జీఎంఎం ఫౌడ్లర్, అళ్కైల్ అమినీస్ కెమికల్స్, నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, అబోట్ ఇండియాతో పాటు డిక్సన్ టెక్నాలజీస్, జేపీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, అవెన్యూ సూపర్ మార్కెట్, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, బెర్జర్ పెయింట్స్, రెలాక్సో ఫూట్ వేర్స్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఐపీసీఏ లేబోరేటరీస్, భారతీ ఎయిర్ టెల్, దీపక్ నైట్రేట్స్, టాటా కన్స్యూమర్స్, నెస్ట్లే, డాక్టర్ రెడ్డీస్, అస్ట్రా జెనీకా పార్మా, గ్రాన్యుయల్స్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, దివిస్ ల్యాబ్స్, వైభవ్ గ్లోబల్, ధనుకా అగ్రిటెక్ ఉన్నాయి.

English summary

మోడీ ఏడాది కాలంలో అదానీ సహా ఈ స్టాక్స్ దుమ్మురేపాయి | stocks more than doubled rose over 50 percent in first year of Modi's second stint

Investors might have lost about Rs 27 lakh crore in terms of market capitalisation in the first year of Modi 2.0, but five stocks turned multibaggers and 20 stocks rose more than 50 percent in the first year of the Modi government's second stint at the Centre.
Story first published: Sunday, May 31, 2020, 19:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X