For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రంగాల్లో 3 ఏళ్లలో 44% పెరిగిన ఉద్యోగాలు: వారికే డిమాండ్ ఎక్కువ, ఢిల్లీ ఫస్ట్

|

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (STEM) సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు గత మూడేళ్ల కాలంలో భారీగా పెరిగాయని ఓ సర్వేలో తేలింది. 2016 నవంబర్ నుంచి 2019 నవంబర్ మధ్య STEM సంబంధిత ఉద్యోగాలు 44 శాతం పెరిగినట్లు ఇండీడ్ తెలిపింది. ఈ మూడేళ్ల కాలంలో తమ వెబ్‌సైట్‌లో జరిగిన పోస్టింగ్స్, సెర్చింగ్స్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు తెలిపింది.

SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్‌లోన్ స్కీం: ప్రయోజనమెలా?SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్‌లోన్ స్కీం: ప్రయోజనమెలా?

ఏడాదిలో 5 శాతం వృద్ధి

ఏడాదిలో 5 శాతం వృద్ధి

రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) వంటి పలు సాంకేతికతల్లో వస్తున్న పురోగతి కారణంగా ఉద్యోగార్థులకు STEM కొలువులు అత్యంత నమ్మకమైనవిగా మారాయని పేర్కొంది. ఈ రంగంలో 2018 వంబర్ నుంచి 2019 నవంబర్ మధ్య ఉద్యోగాలు 5 శాతం పెరిగినట్లు తెలిపింది.

టాప్‌లో ఢిల్లీ

టాప్‌లో ఢిల్లీ

మొత్తం STEM ఉద్యోగాల్లో ఢిల్లీ 31% కొలువులను కల్పించి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ముంబై 21%, బెంగళూరు 14%, పుణె 12%, హైదరాబాద్ 12%, చెన్నై 10% ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే పశ్చిమ భారత రాష్ట్రాలు అత్యధికంగా 34% ఉద్యోగాలను కల్పిస్తే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు చెరో 31% ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

డెవలపర్స్‌కు భారీ డిమాండ్

డెవలపర్స్‌కు భారీ డిమాండ్

STEM రంగాల్లో డెవలపర్స్‌కు భారీ డిమాండ్ ఉంది. అధిక డిమాండ్ కలిగిన టాప్ 5 తీసుకుంటే 1. సాఫ్టువేర్ ఇంజినీర్, 2. php డెవలపర్స్, 3. డాట్ నెట్ డెవలపర్, 4. ఆండ్రాయిడ్ డెవలపర్, 5. ఫుల్ స్టాక్ డెవలపర్‌కు ఉంది. STEMలో డిమాండ్ ఇండియన్ ఉద్యోగార్థులకు అనుగుణంగా ఉంది.

స్థిరమైన వృద్ధి

స్థిరమైన వృద్ధి

గత మూడేళ్లుగా STEM రంగాల్లో ఉద్యోగాల పరంగా స్థిరమైన వృద్ధి కనిపించిందని, అందుకే ఇటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఈ స్టడీలో తేలిందని ఇండీడ్ ఇండియా ప్రతినిధి వెంకట మాచవరపు అన్నారు. రోబోటిక్స్, IoT వంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో టెక్ టాలెంట్‌కు పురోగతి ఉందని చెప్పారు. ఏదేమైనా ఈ రంగాల్లో నిరంతరం స్కిల్స్ పెంచుకోవడం మంచిదని చెప్పారు.

English summary

ఈ రంగాల్లో 3 ఏళ్లలో 44% పెరిగిన ఉద్యోగాలు: వారికే డిమాండ్ ఎక్కువ, ఢిల్లీ ఫస్ట్ | STEM jobs in India see 44 percent increase between 2016 to 2019

Science, technology, engineering, mathematics (STEM) related job roles have been increasing steadily in the country and have increased 44 per cent between November 2016 and November 2019, according to a report.
Story first published: Monday, January 13, 2020, 14:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X