For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బతో భారీగా పెరుగుతున్న అప్పులు, ఆర్థిక చిక్కులు

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంపై రుణభారం పెరుగుతోంది. బడ్జెట్ లోటును తీర్చడానికి రాష్ట్రాలు కూడా ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది. ప్రపంచంలోనే భారీగా వలసలు భారత్ నుండి ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ పైన... ప్రజారోగ్య సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభుత్వాలు ముందున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. ఓ వైపు పన్నులు తగ్గి, మరోవైపు అధిక వ్యయాలు కావడంతో ప్రభుత్వాలపై ఒత్తిడి నెలకొందని తెలిపింది.

ప్యాకేజీ: ఆదాయపు పన్ను ప్రయోజనాలు, ఫోన్ల ధర తగ్గింపు... కేంద్రం ఏం ప్రకటన చేయవచ్చు?ప్యాకేజీ: ఆదాయపు పన్ను ప్రయోజనాలు, ఫోన్ల ధర తగ్గింపు... కేంద్రం ఏం ప్రకటన చేయవచ్చు?

ఆర్థిక సంకోచం.. రుణ భారం

ఆర్థిక సంకోచం.. రుణ భారం

భారత ఫెడరల్ ప్రభుత్వం రుణ ప్రణాళికను రెండోసారి 13 ట్రిలియన్ రూపాయలకు (177 బిలియన్ డాలర్లు)కు సవరించింది. జీఎస్టీ కలెక్షన్లు భారీగా తగ్గడంతో రాష్ట్రాలకు పరిహారం కోసం 1.1 ట్రిలియన్ రూపాయలకు అంగీకరించింది. కరోనా దెబ్బతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఆర్థిక సంకోచం కూడా ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 10 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తిలో 2.8 శాతం స్థూల ద్రవ్యలోటును బడ్జెట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్రాల బడ్జెట్ పైన చేసిన సర్వే ఆధారంగా వెల్లడవుతోంది. మార్చి 2020తో ముగిసిన ఆర్థికసంవత్సరంలోని 3.2శాతంతో పోల్చినా లేదా 3శాతం పరిమితితో పోల్చినా తక్కువే అయినప్పటికీ కరోనా కారణంగా ఈ అంచనాలు తలకిందులవుతాయని ఆర్బీఐ భావిస్తోంది.

కరోనాతో దెబ్బ

కరోనాతో దెబ్బ

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లక్ష్యాలను, అసోసియేటెడ్ రిసిప్ట్స్‌ను కరోనా మహమ్మారి దెబ్బతీసే పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర బ్యాంకు తెలిపింది. రుణ పెరుగుదల వంటివి రాష్ట్రాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందని పేర్కొంది. 2026 నుండి ఒత్తిడి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రాష్ట్రాల రుణ పరిపక్వత ప్రొఫైల్ సూచిస్తోంది. రాబోవు సంవత్సరాల్లో ప్రోవిన్స్ బారోయింగ్స్ పెరగవచ్చునని చెబుతోంది.

ఆర్థిక అంతరం..

ఆర్థిక అంతరం..

రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అంతరం డబుల్ డిజిట్‌కు చేరుకుంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ ఆర్థికవేత్తల సర్వే ప్రకారం ప్రభుత్వం లక్ష్యం 3.5 శాతంతో పోలిస్తే జీడీపీలో 8 శాతానికి పెరుగుతుందని అంచనా. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యాన్ని పెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంపై సడలింపులు వచ్చాయి.

English summary

కరోనా దెబ్బతో భారీగా పెరుగుతున్న అప్పులు, ఆర్థిక చిక్కులు | States rising debt amid pandemic a risk to their finances: RBI

Indian states are racking up more debt to fund the prospect of wider budget deficits as they step up spending to fight the virus pandemic, the central bank said.
Story first published: Tuesday, October 27, 2020, 21:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X