SBI Bank: షాకిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మరోసారి వడ్డీరేట్లు పెంపు..
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణగ్రహీతలకు షాక్ ఇచ్చింది. రుణాలపై మరోసారి వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండయా రెపో రేటను 50 బేస్ పెంచడంతో ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లు పెచ్చింది. ఎస్బీఐతో పాటు మిగతా బ్యాంకులు కూడా త్వరలో వడ్డే రేట్లు పెంచే అవకాశం ఉంది. ఎస్బీఐ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేటును పెంచింది. ఈ పెంపుతో SBI EBLR 8.55%, RLLR 8.15 శాతానికి చేరుకుంది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు 1 అక్టోబర్ 2022 నుంచి అమలుల్లోకి వచ్చాయి.
EMI ఎంత పెరుగుతందంటే..
మీరు ఎస్బీఐలో రూ.35 హోం లోను 20 సంవత్సరాల కాలానికి తీసుకుంటే.. పాత వడ్డీ ప్రకారం మీకు నెలకు రూ. 29,384 కట్టాలి. అయితే వడ్డీ 8.05 శాతం నుంచి 8.55 శాతానికి పెరగడంతో మీరు నెలకు 30,485 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీ హోం లోన్ ఈఎంఐ రూ.1,101 పెరిగింది. ఒకవేళ మీకు ఈఎంఐ పెరగకూడదంటే లోన్ కాల వ్యవధిని పెంచుకోవాల్సి ఉంటుంది.

వడ్డీ రేటు
హోం లోన్ పై అందరికి వడ్డీ ఒకే విధంగా ఉండదు. CIBIL స్కోర్, రుణగ్రహీత ప్రొఫైల్, రేషన్ టు వాల్యూ రేషన్, రిస్క్ అసెస్‌మెంట్, పేమెంట్ ఫెయిల్యూర్ మొదలైన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని హోమ్ లోన్‌పై విధించే వడ్డీ రేటు నిర్ణయిస్తారు.