For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Corona Vaccine: స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ డోస్ ధర రూ.1,250

|

రష్యన్ కొవిడ్ 19 వ్యాక్సీన్ స్పుత్నిక్ వీ ధరను ఒక డోసుకు రూ.1,250గా నిర్ణయించింది అపోలో హాస్పిటల్స్. అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలతో కలుపుకొని ఈ ధర ఉంటుంది. కో-విన్ యాప్ పైన ఈ ధర సూచిస్తోంది. గత శుక్రవారం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) భారత భాగస్వామి అయిన డాక్టర్ రెడ్డీస్ డోస్ ధర రూ.995గా ప్రకటించింది. ఇందులో జీఎస్టీ 5 శాతం కూడా ఉంది. అయితే ఈ వ్యాక్సీన్ జూన్ మిడిల్ నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

స్పుత్నిక్-వి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. వీటిని పరీక్షించేందుకు తొలి దశలో డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన 50,000 ఉద్యోగులు, వారి కుటుంబాలకు వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. సోమవారం హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. నేడు (మంగళవారం) విశాఖపట్నంలో ప్రారంభమవుతోంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, పుణే నగరాలకు విస్తరించనుంది.

Sputnik V debuts on Co Win at Rs 1,250 a dose as Dr Reddy’s ties with Apollo

తాము 1.5 లక్షల డోస్‌లను రష్యా నుండి దిగుమతి చేసుకోనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈవో-బ్రాండెడ్ మార్కెట్స్(ఇండియా అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్) ఎంవీ రమణ తెలిపారు. వచ్చే ఎనిమిది నుండి పన్నెండు నెలల కాలంలో దేశంలోని 125 మిలియన్ల భారతీయులకు వ్యాక్సినేషన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఇందులో 36 మిలియన్ల దిగుమతి డోస్‌లు ఉన్నాయి. ఇవి కేవలం 18 మిలియన్ల ప్రజలకు మాత్రమే సరిపోతాయి.

English summary

Corona Vaccine: స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ డోస్ ధర రూ.1,250 | Sputnik V debuts on Co Win at Rs 1,250 a dose as Dr Reddy’s ties with Apollo

Russian Covid-19 vaccine Sputnik V made its debut on the Co-Win Covid-19 vaccination platform with Dr Reddy’s Laboratories announcing a national tie-up with Apollo Hospitals for Russian Covid-19 vaccine Sputnik V.
Story first published: Tuesday, May 18, 2021, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X