For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Farmers: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాతలకు ఊరటను కల్పించిన కేంద్ర ప్రభుత్వం..

|

Farmers: వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తనవంతు సాయాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో అన్నదాతలకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది వారికి నిజంగానే ఊరటను ఇచ్చే పెద్ద వార్త అని చెప్పుకోవాలి.

ఆన్ లైన్ లో..

ఆన్ లైన్ లో..

ఇంట్లో వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినట్లుగానే ఇకపై రైతులు తమకు వ్యవసాయంలో అవసరమైన పురుగు మందులను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా పురుగు మందులు ఆర్డర్ చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పెస్టిసైడ్స్ రూల్స్‌ సవరించింది. దీంతో రైతులు ఇకపై వారికి వ్యవసాయంలో అవసరమైన వాటిని ఇంటి వద్ద నుంచే ఆర్డర్ చేసి డెలివరీ పొందొచ్చు.

సమస్యకు పరిష్కారం..

సమస్యకు పరిష్కారం..

సాధారణంగా ఊళ్లలోని రైతులు పెస్టిసైడ్స్ డీలర్లను నమ్మి వారు ఇచ్చే పురుగు మందులను వినియోగిస్తుంటారు. కొన్ని సార్లు రైతులు అడిగిన బ్రాండ్ పెస్టిసైడ్స్ రిమోట్ ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. అలాంటి సందర్బంలో నయా ఆన్ లైన్ పద్ధతి ద్వారా ఎక్కడి నుంచైనా తమకు అవసరమైన వాటిని ఆర్డర్ చేసి నేరుగా ఇంచి వద్దకే తెప్పించుకోవచ్చు.

లైసెన్స్..

లైసెన్స్..

ఆన్ లైన్ లో క్రిమిసంహారకాలను విక్రయించటానికి సంస్థలు ముందుగా అందుకోసం ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు మాత్రమే వీటిని విక్రయించటానికి అర్హులని తెలుస్తోంది. ఆన్ లైన్ విధానాన్ని తీసుకురావటం వ్యవసాయాన్ని సులభతరం చేయటంతో పాటు దేశ వ్యాప్తంగా కోట్ల మంది రైతులకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని తెలుస్తోంది.

English summary

Farmers: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాతలకు ఊరటను కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. | soon farmers can order insectisides throuh online order as centre changing rules

soon farmers can order insectisides throuh online order as centre changing rules
Story first published: Wednesday, November 30, 2022, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X