For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్‌టాక్ ఇండియా కొనుగోలుకు సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి

|

చైనా బైట్‌డ్యాన్స్‌కు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కొనుగోలుకు లేదా ఇందులోని వాటాలు దక్కించుకునేందుకు వివిధ దేశాల్లో దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఇండియాలో రిలయన్స్‌తో చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. టిక్‌టాక్ భారత్ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు సాఫ్టుబ్యాంక్ కూడా ఆసక్తి కనబరుస్తోంది.

ఎన్పీఏలుగా వద్దు.. లోన్ మారటోరియంపై తాత్కాలిక ఊరట: వడ్డీ భారం తప్పదు!ఎన్పీఏలుగా వద్దు.. లోన్ మారటోరియంపై తాత్కాలిక ఊరట: వడ్డీ భారం తప్పదు!

టిక్‌టాక్ సహా వందలాది చైనాకు చెందిన యాప్స్‌ను భద్రతా కారణాలతో భారత ప్రభుత్వం నిషేధించింది. అమెరికాలోను అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దీంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ వాటాల విక్రయానికి మొగ్గు చూపుతోంది. ఇందుకు భాగస్వాముల కోసం వెతుకుతోంది... చర్చలు జరుపుతోంది.

 Softbank eyeing TikTok bid partner

బైట్‌డాన్స్‌లో వాటా కలిగి ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ టిక్‌టాక్ భారత్ విభాగాన్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గత నెలలో రిలయన్స్, ఎయిర్‌టెల్‌తోనూ చర్చలు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సాఫ్ట్‌బ్యాంక్, బైట్‌డాన్స్, రిలయన్స్, భారతి ఎయిర్‌టెల్ స్పందించాల్సి ఉంది. కేంద్రం టిక్‌టాక్‌తో సహా చైనా యాప్‌లను అంతకుముందు నిషేధించింది. రెండు రోజుల క్రితం మరో 118 యాప్స్‌ను నిషేధించింది. దీంతో 20 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న అతిపెద్ద మార్కెట్లో టిక్‌టాక్‌కు గట్టి దెబ్బ తగిలింది.

English summary

టిక్‌టాక్ ఇండియా కొనుగోలుకు సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి | Softbank eyeing TikTok bid partner

SoftBank Group Corp. is exploring assembling a group of bidders for TikTok’s India assets and has been actively looking for local partners, according to people familiar with the matter.
Story first published: Friday, September 4, 2020, 15:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X