For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 ఏళ్లలో సెస్, సర్‌ఛార్జీ వాటా డబుల్, ఏపీ-తెలంగాణకు ఎంత తగ్గిందంటే?

|

న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాల్లో సెస్, సర్‌చార్జీ వాటా తొమ్మిదేళ్లలో రెట్టింపు అయింది. 201-12లో ఈ వాటా 10.4 శాతంగా ఉండగా, తాజాగా 19.9 శాతానికి చేరుకుందని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ విధానం కింద కేంద్రం వసూలు చేసే సెస్, సర్‌ఛార్జీలను రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన అవసరం లేదు. అదే సమయంలో రాష్ట్రాలకు పరిహారం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ పెంచాలని సూచించింది. మంగళవారం ఇండియా రేటింగ్స్ నివేదిక విడుదలైంది.

ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ, అమెరికాతో మనోళ్లు పోటీప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ, అమెరికాతో మనోళ్లు పోటీ

ఏపీ తెలంగాణలకు ఎంత తగ్గిందంటే

ఏపీ తెలంగాణలకు ఎంత తగ్గిందంటే

కేంద్రం నుండి రాష్ట్రాలకు బదలీ అయ్యే ఆర్థికేతర కమీషన్లు 2019-20లో 48.6 శాతానికి పరిమితమయ్యాయి. 2011-12లో ఇది 53.4 శాతంగా ఉంది. కేంద్రం ఇంకా రాష్ట్రాలకు ఇచ్చే రూ.1.8 లక్షల కోట్ల గ్రాంట్స్ ప్రతిపాదనలు అంగీకరించాలి. తాజా ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారం ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌కు 35 బేసిస్ పాయింట్లు తగ్గి 4.05 శాతానికి పరిమితమైంది. తెలంగాణకు 40 బేసిస్ పాయింట్లు తగ్గి 2.10 శాతంగా ఉంది. అసోంకు 24 బేసిస్ పాయింట్లు కర్నాటకకు 118, కేరళకు 60 తగ్గాయి.

మహారాష్ట్రకు పెరిగిన వాటా

మహారాష్ట్రకు పెరిగిన వాటా

ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గగా, మహారాష్ట్ర అత్యధికంగా 64 బేసిస్ పాయింట్ల మేర కేంద్ర పన్నుల్లో వాటాను పెంచుకుంది. రాజస్థాన్ 38 బేసిస్ పాయింట్లు, అరుణాచల్ ప్రదేశ్ 33, గుజరాత్ 31 బేసిస్ పాయింట్ల మేర వాటా పెంచుకుంది.

ఉత్తర ప్రదేశ్ టాప్

ఉత్తర ప్రదేశ్ టాప్

కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్‌లో మొదటి అయిదు రాష్ట్రాల్లో 16.3 శాతంతో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బీహార్ 9.1 శాతం, పశ్చిమ బెంగాల్ 7.7 శాతం, మధ్యప్రదేశ్ 7.3 శాతం, మహారాష్ట్ర 6.4 శాతంతో ఉన్నాయి.

English summary

9 ఏళ్లలో సెస్, సర్‌ఛార్జీ వాటా డబుల్, ఏపీ-తెలంగాణకు ఎంత తగ్గిందంటే? | Share of cess, surcharge in tax revenue doubles in 9 years

The share of cesses and surcharges in the gross tax revenue of the Centre has nearly doubled to 19.9 per cent in 2020-21 from 10.4 per cent in 2011-12, leading to the 15thFinance Commission to recommend a higher grant-in-aid and lower tax devolution to the states, according to a report.
Story first published: Wednesday, March 3, 2021, 8:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X