For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీలక నిర్ణయం... విడిపోయే సమయం! టాటా సన్స్ నుండి ఎస్పీ గ్రూప్ ఔట్!

|

70 ఏళ్ల అనుబంధం తర్వాత టాటా గ్రూప్ నుండి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ మంగళవారం పేర్కొంది. 'టాటా గ్రూప్ నుండి వేరు చేయడం అవశ్యమని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ఈ రోజు సుప్రీం కోర్టు ఎదుట తెలిపింది.' అని కంపెనీ తన ప్రకటనలో వెల్లడించింది. విభజన స్టేక్ హోల్డర్ గ్రూప్స్‌కు ఉపయుకుతంగా ఉంటుందని బరువెక్కిన హృదయంతో మిస్త్రీ ఫ్యామిలీ విశ్వసిస్తోందని ఈ గ్రూప్ తన ప్రెస్ స్టేట్‍‌మెంట్‌లో తెలిపింది.

కరోనా వైరస్ లాక్‌డౌన్, దారుణంగా పతనమైన బంగారం స్మగ్లింగ్కరోనా వైరస్ లాక్‌డౌన్, దారుణంగా పతనమైన బంగారం స్మగ్లింగ్

టాటా సన్స్‌లో తన రెండు పెట్టుబడి సంస్థల ద్వారా 18.4 శాతం వాటాను కలిగి ఉన్న ఎస్‌పీ గ్రూప్... ఇప్పుడు ఈ వాటాను విక్రయించడానికి, ఈ సంస్థ నుండి బయటపడేందుకు సిద్ధంగా ఉందని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ తెలిపింది. టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా కలిగిన ఎస్పీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీ కాదు. అయితే ఇందుకు దగ్గరగా ఉంది. టాటా సన్స్ కూడా షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ స్టేక్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది.

Shapoorji Pallonji Group agrees to exit Tata Sons

2016లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్‌గా తొలగించిన అనంతరం, డిసెంబర్ 2016న సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం ఇప్పుడు షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్ నుండి కీలక ప్రకటన వెలువడింది. మిస్త్రీని తొలగించినప్పటి నుండి టాటా సన్స్ వ్యాల్యూ డిస్ట్రక్టివ్ బిజినెస్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఎస్పీ గ్రూప్ తెలిపింది. టాటా సన్స్ ప్రస్తుత నాయకత్వం నిరూపించడం కోసం తప్పుదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా విలువల విధ్వంసకర వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది.

English summary

కీలక నిర్ణయం... విడిపోయే సమయం! టాటా సన్స్ నుండి ఎస్పీ గ్రూప్ ఔట్! | Shapoorji Pallonji Group agrees to exit Tata Sons

Tata Sons has offered to buy out Shapoorji Pallonji group's stake in the holding company to help the group raise money to pay its debt. The Supreme Court has also barred the Mistry group from pledging or selling any Tata shares until October 28, when it starts hearing final arguments in the case.
Story first published: Tuesday, September 22, 2020, 21:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X