For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 870 పాయింట్లు పతనం

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 5) భారీ నష్టాల్లో ముగిశాయి. ఓ సమయంలో 1300 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్ చివరకు 870 పాయింట్ల నష్టంతో ముగిసింది. కరోనా భయాలు మార్కెట్లను నిండా ముంచాయి. దేశంలో మళ్లీ కరోనా భారీ స్థాయిలో వ్యాపిస్తుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నుండి ప్రతికూలంగానే కదలాడాయి. ఏ దశలోను కోలుకున్న పరిస్థితి కనిపించలేదు. నష్టం మాత్రమే కాస్త తగ్గింది.

ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు గడుస్తున్నకొద్దీ అంతకంతకు దిగజారాయి. ఉదయం సెన్సెక్స్ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ దశలో సెన్సెక్స్ 1,449 పాయింట్లు కుంగి 48,580 వద్ద, నిఫ్టీ 408 పాయింట్లు కోల్పోయి 14,459 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్‌ విలువలో దాదాపు రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

Sensex slumps 870 points lower, Nifty ends below 14,650

మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కనిష్ఠాల నుండి సూచీలు కోలుకున్నట్లు కనిపించినా అంతంత మాత్రమే. అప్పటికీ భారీ నష్టాల్లోనే ఉన్నాయి. చివరకు సెన్సెక్స్ 870 పాయింట్ల నష్టంతో 49,159 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు కోల్పోయి 14,637 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.33 వద్ద స్థిరపడింది.

English summary

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 870 పాయింట్లు పతనం | Sensex slumps 870 points lower, Nifty ends below 14,650

The Indian benchmark indices, Sensex and Nifty ended sharply lower on Monday dragged by heavy selling was witnessed in banks, auto, FMCG and financial sectors. Broader markets, smallcap and midcap indices closed over 1 percent lower each. Buying was witnessed in Nifty IT and Nifty Metal indices.
Story first published: Monday, April 5, 2021, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X