For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్టప్స్ లిస్టింగ్ నిబంధనలు సులభతరం చేసిన సెబి

|

స్టార్టప్స్ లిస్టింగ్‌ను ప్రోత్సహించే క్రమంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) కొన్ని నిబంధనలను సరళీకరించింది. 25 శాతం ఫ్రీ-ఇష్యూ క్యాపిటల్ హోల్డింగ్ సమయాన్ని రెండేళ్ల నుండి ఏడాదికి కుదించింది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు రూ.5 కోట్ల వరకు విచక్షణాధికార కేటాయింపుకు కూడా అనుమతించింది. ఇదివరకు ఇది ప్రీ-ఇష్యూ హోల్డింగ్‌లో పది శాతంగా ఉంది. ముప్పై రోజుల లాకిన్ గడువుతో ఇష్యూ పరిమాణంలో అరవై శాతం వరకు షేర్లను కేటాయించుకోవచ్చు.

ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్‌ఫాం ద్వారా స్టార్టప్స్ లిస్టింగ్‌కు వీలు కల్పిస్తుంది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో లిస్ట్ కాని కంపెనీలు, ప్రమోటర్లు, ఆర్థిక ఫలితాలు తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకుంది. ఐజీపీలో లిస్ట్ కావడానికి సుపీరియర్ వోటింగ్ రైట్స్‌కు కంపెనీలకు అనుమతించింది. లిస్టింగ్ కానీ కంపెనీల ఓపెన్ ఆఫర్ 26 శాతం నుండి 49 శాతానికి పెంచింది. కంపెనీ డీ-లిస్ట్, మెయిన్ బోర్డుకు మైగ్రేట్ కావడాన్ని కూడా సులభతరం చేసింది.

Sebi makes it easier for startups to list in India

ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలను నిర్ధారించడంలో ిప్పుడున్న మార్గదర్శకాలను సెబి క్రమబద్ధీకరించింది. ఐజీపీ ప్లాట్‌ఫామ్ కోసం పలు మార్పులు చేయబడ్డాయని, ఇది స్టార్టప్స్ ద్వారా సులభంగా నిధుల సేకరణకు ఉపకరిస్తుందని బీడీవో ఇండియా పార్ట్‌నర్ అండ్ లీడర్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రాజేష్ టక్కర్ అన్నారు.

English summary

స్టార్టప్స్ లిస్టింగ్ నిబంధనలు సులభతరం చేసిన సెబి | Sebi makes it easier for startups to list in India

The markets regulator on Thursday made it easier for startups to go public in India as it moved to stanch a potential exodus of local companies to foreign capital markets.
Story first published: Friday, March 26, 2021, 21:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X