For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 ఏళ్లలో చెల్లించాలి: AGR బకాయిలపై ఎయిర్‌టెల్‌కు ఊరట, వొడాఫోన్ ఐడియాకు భారమేనా?

|

AGR బకాయిలకు సంబంధించి టెల్కోలకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ బకాయిలను పదేళ్లలోగా చెల్లించాలని ఆదేశించింది. ఏజీఆర్ బకాయిలపై గత కొంతకాలంగా సుప్రీం కోర్టులో విచారణ సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ బకాయిలను 15 నుండి ఇరవై ఏళ్ల గడువును కోరాయి. కానీ పదేళ్ల పాటు వెసులుబాటు దొరికింది. ఏజీఆర్ బకాయిల కోసం 20 ఏళ్ల సమయం ఇచ్చేందుకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. పదేళ్ల గడువు మాత్రమే ఇచ్చింది. బకాయిలు చెల్లిస్తామని టెల్కోల ఎండీలు, సీఈవోలు లిఖితపూర్వకంగా అందించాలని చెప్పింది. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లేనని, జరిమానా, వడ్డీ విధిస్తామని తెలిపింది.

గుడ్‌న్యూస్, లోన్ మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించవచ్చు!గుడ్‌న్యూస్, లోన్ మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించవచ్చు!

10 శాతం చెల్లించాలి

10 శాతం చెల్లించాలి

ఏజీఆర్ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం 20 సంవత్సరాల గడువును ప్రతిపాదించింది. టెలికం కంపెనీలు పదిహేనేళ్లు అభ్యర్థించాయి. కొంతలో కొంత ఊరటగా పదేళ్ల సమయం దొరికింది. కాగా, ఏజీఆర్ చెల్లింపులకు పదేళ్ల గడువు ఇచ్చినప్పటికీ, ఈ బకాయిల్లో 10 శాతం మొత్తాన్ని మార్చి 31, 2021 నాటికి చెల్లించాలని ఆదేశించింది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలు రూ.50,440 కోట్లుగా ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ రూ.26,000 కోట్ల వరకు ఉన్నాయి. వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికే రూ.7,854 కోట్లను చెల్లించింది. ఎయిర్‌టెల్ రూ. 18,000 కోట్లను చెల్లించింది.

వొడాఫోన్ ఐడియా షేర్లు డౌన్, ఎయిర్‌టెల్ జూమ్

వొడాఫోన్ ఐడియా షేర్లు డౌన్, ఎయిర్‌టెల్ జూమ్

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ వరకు బకాయిల చెల్లింపులు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తగా, ఎయిర్‌టెల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వొడాఫోన్ ఐడియా షేర్లు 13 శాతం క్షీణించగా, ఎయిర్‌టెల్ షేర్ 7 శాతం ఎగిసింది. వొడాఫోన్ ఐడియా షేర్లు మొదట భారీగా పెరిగాయి. ఓ దశలో రూ.10.80 తాకింది. చివరకు రూ.8.80 వద్ద క్లోజ్ అయింది.

వొడాఫోన్ ఐడియాకు ఆర్థికంగా భారం

వొడాఫోన్ ఐడియాకు ఆర్థికంగా భారం

భారతీ ఎయిర్‌టెల్‌కు క్రమంగా చెల్లింపులు జరిపే సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వొడాఫోన్ ఐడియాకు ప్రతి ఏడాది రూ.5.000 కోట్ల అవుట్ ఫ్లో ఉంటుందని, ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా ఆర్పు ఏ మేరకు వస్తుంద వంటి అంశాలను ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది వొడాఫోన్ ఐడియాకు ఇబ్బందికరమే అంటున్నారు.

English summary

10 ఏళ్లలో చెల్లించాలి: AGR బకాయిలపై ఎయిర్‌టెల్‌కు ఊరట, వొడాఫోన్ ఐడియాకు భారమేనా? | SC's AGR Verdict: Telcos get 10 years to clear AGR dues

In what comes as a disappointment for Bharti Airtel, and more so for Vodafone Idea, Justice Arun Mishra-led bench of the Supreme Court has refused to allow telecom companies to make payment of AGR dues over 20 years. The court has instead allowed only a 10-year window for the telcos to repay.
Story first published: Tuesday, September 1, 2020, 18:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X