ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. యోనో యాప్ రెండు రోజుల పాటు అండర్ మెయింటెన్స్‌లో ఉంటుందని నిన్న ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించి తేదీలు ఇచ్చింది. ఒకటి నేడు 11వ తేదీ, మరొకటి 13వ తేదీ అండర్ మెయింటెన్స్‌లో ఉంటుంది. యోనో యాప్ పై రెండు తేదీల్లో ఉదయం గం.12 నుండి ఉదయం గం.4 వరకు మెయింటెనెన్స్‌లో ఉందని, కాబట్టి కస్టమర్లు తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ఎస్బీఐ తన ట్వీట్‌లో పేర్కొంది.

యోనో స్పెషల్ ఫీచర్స్
SBI తన యోనో యాప్ ప్రత్యేక ఫీచర్స్‌ను ఇటీవల ప్రవేశ పెట్టింది. ప్రీ-లాగిన్ లక్షణాలతో ఎస్బీఐ ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతా వివరాలను యాక్సెస్ చేసుకోవచ్చు. పాస్‌బుక్ చూసుకోవచ్చు. ఎస్బీఐ యోనో యాప్‌కు లాగిన్ కాకుండానే ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయవచ్చు. 'ఇప్పుడు యాప్‌లోకి లాగిన్ కాకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి చేయండి. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. పాస్‌బుక్ చూసుకోండి. యోనో ఎస్బీఐతో త్వరగా బ్యాంకింగ్ చేయండి' అని ఇటీవల ట్వీట్ చేసింది.

లాగిన్ అవసరం లేకుండా ట్రాన్సాక్షన్
ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తెలుసుకోవడం కోసం ఇటీవలి వరకు లాగిన్ తప్పనిసరి. కానీ ఇప్పుడు లాగిన్ అవాల్సిన అవసరం లేదు. పై సేవలు పొందేందుకు ముందుగానే సెట్టింగ్ చేసుకోవాలి. కస్టమర్లు యోనో యాప్‌ను ఓపెన్ చేసి వ్యూ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయాలి. ఎంపిన్, బయోమెట్రిక్ వంటి వాటి ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. గతంలో జరిగిన ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకోవాలంటే వ్యూ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయాలి. యోనో యాప్ ద్వారా సులువుగా పేమెంట్స్ కూడా చేయవచ్చు. లాగిన్ అవసరం లేకుండా రూ.2000 ట్రాన్సాక్షన్స్ జరపవచ్చు. యోనో క్విక్ ప్లే చేయడం ద్వారా ఇది సాధ్యం.

ఎస్బీఐ యోనో యాప్
లాగిన్ ఆప్షన్‌తో పాటు ఇప్పుడు ఎస్బీఐ యోనో యాప్‌లో వ్యూ బ్యాలెన్స్, క్విక్ పే ఆప్షన్ ఉంటుంది.ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి 6 అంకెల MPIN లేదా బయోమెట్రిక్ అథంటేఫికేషన్/ఫేస్ ఐడీ లేదా యూజర్ ఐడీ మరియు పాస్ వర్డ్ అవసరం.ఎస్బీఐ తన వినియోగదారుల బ్యాంకింగ్, షాపింగ్ అవసరాలు తీర్చడానికి 2017లో యోనో యాప్‌ను తీసుకు వచ్చింది. కన్సల్టెంట్ మెకెన్సీ, టెక్ మేజర్ ఐబీఎం సహకారంతో ఎస్బీఐ ఈ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications