For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు రోజులుగానా... SBI యోనో యాప్‌లో సాంకేతిక సమస్య కంటిన్యూ!

|

ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కి చెందిన యోనో యాప్‌లో గురువారం కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. కస్టమర్లకు ఎర్రర్ ఎం005 మెసేజ్ కనిపించింది. బుధవారం కూడా కస్టమర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వరుసగా గురువారం నాడు కూడా ఇబ్బంది తలెత్తడంతో ట్రాన్సాక్షన్స్ చేసే సౌకర్యం లేకుండా పోయింది. దీంతో కస్టమర్లు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

కస్టమర్ల సేవలకు ఇబ్బందిలేదు: RBI ఆదేశాలపై HDFC, అసలేం జరిగింది?కస్టమర్ల సేవలకు ఇబ్బందిలేదు: RBI ఆదేశాలపై HDFC, అసలేం జరిగింది?

యోనో లైట్ యాప్ వినియోగించాలని.

యోనో లైట్ యాప్ వినియోగించాలని.

ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకులో గత రెండేళ్లలో రెండు మూడు సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇతర బ్యాంకులకు సంబంధించిన యాప్స్ లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లోను సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టం వైఫల్యం కారణంగా తమ యోనో మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు ఎస్బీఐ గురువారం తెలిపింది. సేవల్ని పునరుద్ధరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ట్రాన్సాక్షన్స్‌కోసం నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌ను వినియోగించాలని కస్టమర్లను కోరింది. గత నెలలోను బ్యాంక్ ఆన్ లైన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

3 రోజులుగా పని చేయడం లేదు

3 రోజులుగా పని చేయడం లేదు

యోనో యాప్ వరుసగా మూడు రోజులుగా పని చేయడం లేదని ట్విట్టర్‌లో కస్టమర్లు అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు ఇలా ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదని, వీటిని దిగ్గజ ఐటీ సంస్థలు మెయింటెన్ చేస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.

నెటిజన్లు సెటర్లు కూడా వేస్తున్నారు.

'ఎస్బీఐ బ్రాంచీల్లో లంచ్ తర్వాత, ఎస్బీఐ యోనో యాప్ కూడా మెయింటెనెన్స్ తర్వాత'

పంజాబ్ నేషనల్ బ్యాంకులోను...

పంజాబ్ నేషనల్ బ్యాంకులోను...

పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) డిజిటల్ సేవల్లోనూ అంతరాయం ఏర్పడింది. ఇటీవల విలీనం చేసుకున్న బ్యాంకుల ఐటీ ఇన్‌ఫ్రాను అనుసంధానం చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. వీటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

English summary

మూడు రోజులుగానా... SBI యోనో యాప్‌లో సాంకేతిక సమస్య కంటిన్యూ! | SBI YONO app continues to show error on Thursday

State Bank of India (SBI) customers are irked with the bank's Yono (You Only Need One) app which has been down since yesterday.
Story first published: Friday, December 4, 2020, 7:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X