ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్. వడ్డీ రేట్ల మార్పు కాలపరిమితిని తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) లింక్డ్ వడ్డీ రేట్ల కాలపరిమితిని ఏడాది నుండి ఆరు నెలలకు తగ్గించింది. కాలపరిమితిని తగ్గించడం వల్ల హోమ్‌లోన్ రుణగ్రహీతలకు ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు మరింత వేగంగా అందుతాయి. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

అందుకే ఎంసీఎల్ఆర్ కాలపరిమితి తగ్గింపు
ఎంసీఎల్ఆర్ మార్పు కాలపరిమితిని ఏడాది నుండి ఆరు నెలలకు తగ్గించడంతో వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనం కోసం రుణగ్రహీతలు ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. రేపో రేటు ఇతర మార్కెట్ ఆధారిత ప్రామాణికాలపై రుణాలను తీసుకోకుండా ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు తీసుకున్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు వేగంగా అందడం లేదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఎంసీఎల్ఆర్ రేటు
ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రుణాల మంజూరుకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ 7% ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 6.95% ఉంది. ఈ ఏడాది ఈ రెండు రేట్లను 90 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. అయితే కొత్తగా రుణాలు తీసుకున్నవారికే ఈ 6 నెలల ఎంసీఎల్ఆర్ సవరణలు వర్తిస్తాయని తెలుస్తోంది.

ఎంసీఎల్ఆర్ లింక్డ్ వడ్డీ రేటు ఎలా?
బ్యాంకులు రెపో రేటు, ఎంసీఎల్ఆర్ సహా ఇతర ఆధారిత ప్రమాణికాలపై రుణాలు ఇస్తుంది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు తీసుకునే వారికి ప్రస్తుత మార్పు వర్తిస్తుంది. బ్యాంకులు వడ్డీ రేట్లను ఇప్పటి వరకు ఏడాదికి ఓసారి సమీక్షిస్తుంది. అప్పుడే రుణగ్రహీత ఈఎంఐలో మార్పు ఉంటుంది. ఉదాహరణకు లోన్ రీసెట్ డేట్ జనవరి అయితే, బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ను జూలైలో సవరించినట్లయితే, మీ ఈఎంఐపై ఆ ప్రభావం వచ్చే ఏడాది జనవరికి వర్తిస్తుంది. ఇప్పుడు ఆరు నెలలకే మార్పు చేయడం వల్ల రుణగ్రహీతలకు వేగంగా వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనం అందుతుంది. ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 22వేల బ్రాంచీలు, 58,000 ఏటీఎంలు, సీడీఎం నెట్ వర్క్ ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications