For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI: ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అండర్ మెయింటెనెన్స్: పని చేయని సమయం ఇదే

|

ముంబై: దేశంలో లీడ్ బ్యాంక్‌గా గుర్తింపు పొందింది.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశవ్యాప్తంగా అనేక శాఖా కార్యాలయాలను కలిగి ఉంది. వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. అదే స్థాయిలో ఏటీఎంల ద్వారా సేవలను అందిస్తోంది. దానికి అనుగుణంగా- ఆన్‌ప్లాట్ ప్లాట్‌ఫామ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. యాప్స్‌ను వినియోగంలోకి తెచ్చింది. దాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది ఎస్బీఐ మేనేజ్‌మెంట్.

వీకెండ్: పెట్రోల్, డీజిల్ ధరల రేట్ల స్థితిగతులేంటీ?వీకెండ్: పెట్రోల్, డీజిల్ ధరల రేట్ల స్థితిగతులేంటీ?

యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ ప్లాట్‌ఫామ్స్ ద్వారా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే సౌకర్యాన్ని తన ఖాతాదారుల కోసం ప్రవేశపెట్టింది. అవేకాకుండా- తన ఖాతాదారులకు ఎప్పటికప్పుడు సమాచారాలను తెలియజేయడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా ఎస్బీఐ మేనేజ్‌మెంట్ వినియోగించుకుంటోంది. అత్యధిక సంఖ్యలో యూజర్లు ఉన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌గా పేరు తెచ్చుకుంది.

SBIs Internet Banking, Yono, Yono Lite, Yono Business to Be Unavailable today

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నప్పుడు.. వాటిని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎస్బీఐ మేనేజ్‌మెంట్ ఇప్పుడు అదే పని చేస్తోంది. అన్ని రాకల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ను అండర్ మెయింటెనెన్స్ కిందికి చేర్చింది. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, ఐఎంపీఎస్, యూపీఐ పేమెంట్స్ చెల్లింపుల వ్యవస్థలన్నింటినీ మెయింటెనెన్స్ చేయనుంది.

ఎలాంటి అంతరాయాన్ని కలిగించకుండా ఉండేలా వాటిని అప్‌గ్రేడ్ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నందున మూడు గంటల పాటు వాటి సేవలు స్తంభించిపోనున్నాయని ప్రకటించింది. శనివారం రాత్రి 10:35 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 1:35 నిమిషాల వరకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరింది. 180 నిమిషాల పాటు వాటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ప్రకటనను పోస్ట్ చేసింది ఎస్బీఐ మేనేజ్‌మెంట్.

English summary

SBI: ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అండర్ మెయింటెనెన్స్: పని చేయని సమయం ఇదే | SBI's Internet Banking, Yono, Yono Lite, Yono Business to Be Unavailable today

State Bank of India informed the bank's customers that its various digital platforms shall be non-functional between September 4th and September 5th owing to maintenance activity.
Story first published: Saturday, September 4, 2021, 12:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X