For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, SBI యోనో యాప్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ టూవీలర్ లోన్స్

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిండంలో భాగంగా ఎస్బీఐ తీసుకువచ్చిన యోనో యాప్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. దీని వినియోగాన్ని మరింత పెంచేలా ఎస్బీఐ పలు చర్యలు చేపడుతోంది. పండుగ సీజన్‌లో ఈ యాప్ ద్వారా చెల్లింపులు చేసిన వారికి ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తోంది. హోమ్ లోన్స్‌కు యాప్ ్దవారా దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటులో ప్రత్యేక రాయితీ కల్పిస్తుంది. తాజాగా బైక్స్ రుణాలకు కూడా యోనో యాప్ కస్టమర్ ప్రయోజనాలను విస్తరించింది.

యోనో యాప్‌ను వినియోగించే కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ టూ-వీలర్ లోన్స్ అందిస్తోంది. కావాల్సిన వార యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు శాఖను నేరుగా సంప్రదించకుండానే రుణం పొందవచ్చు. వీటినే ఈజీ రైడ్ లోన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.20,000 నుండి రూ.3,00,000 వరకు రుణం లభిస్తుంది. నాలుగేళ్ల కాలపరిమితితో 10.5 శాతం వడ్డీ రేటు ఉంది. వాహనం ఆన్-రోడ్ ధరలో 85 శాతం వరకు రుణం పొందేందుకు ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లకు అర్హత ఉంటుంది.

SBI rolls out two wheeler loan on YONO app

నేరుగా వాహన డీలర్ల ఖాతాకు ఈ రుణ మొత్తం వెళ్లిపోతుంది. యోనో యాప్ 2017లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 8.9 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4.2 కోట్లమంది రిజిస్టర్ అయ్యారు. వీరిలో 1.1 కోట్ల మంది రోజూ యాప్‌ను వినియోగిస్తున్నారు. జూన్ త్రైమాసికంలో యాప్ ద్వారా 1.5 లక్షల కొత్త ఖాతాలు తెరిచారు.

ఎస్బీఐలో తమ కస్టమర్లకు అనుకూలమైన, అవాంతరాలు లేని బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే ప్రత్యేకమైన, అనుకూలీకరించిన ఉత్పత్తులు, సేవలను అందించడం కోసం ప్రయత్నిస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా అన్నారు. ఎస్బీఐ 20 కేటగిరీలలో 110 ఈ-కామర్స్ ప్లేయర్స్‌తో ఒప్పందం చేసుకున్నది.

English summary

గుడ్‌న్యూస్, SBI యోనో యాప్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ టూవీలర్ లోన్స్ | SBI rolls out two wheeler loan on YONO app

SBI on Tuesday launched a pre-approved two-wheeler loan ‘SBI Easy Ride’ on its mobile application YONO.
Story first published: Tuesday, November 2, 2021, 20:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X