For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోలుకోలేని నష్టం: అనిల్ అంబానీపై దివాలా చర్యకు సుప్రీంకు ఎస్బీఐ

|

రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీం కోర్టుకు వెళ్లింది. అనిల్ అంబానీ పైన దివాలా చర్యలకు అనుమతిస్తూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ జారీ చేసిన ఆదేశాలపై ఆగస్ట్ 27న బాంబే హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని ఎస్బీఐ ఇప్పుడు సుప్రీంను ఆశ్రయించింది.

అమెరికా కంటే దారుణం, భవిష్యత్తు కోసం దాచుకోవద్దు: ప్రభుత్వంపై రఘురాం రాజన్అమెరికా కంటే దారుణం, భవిష్యత్తు కోసం దాచుకోవద్దు: ప్రభుత్వంపై రఘురాం రాజన్

దివాలా చర్యలకు ఎస్బీఐ.

దివాలా చర్యలకు ఎస్బీఐ.

రూ.1,200 కోట్ల రుణం విషయంలో ఎస్బీఐ దివాలా చర్యలను చేపట్టడానికి సిద్ధం కాగా, అనిల్ అంబానీకి గత నెలలో ఊరట లభించింది. అలాగే, ఆస్తులను విక్రయిస్తూ అనిల్ అంబానీని నిలువరిస్తూ ఆదేశాలు జారీచేసింది. అడాగ్ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ తీసుకున్న కార్పోరేట్ రుణాలపై అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇవి మొండి బకాయిలుగా మారడంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుండి ఈ మొత్తం రాబట్టాలని ఎస్బీఐ నిర్ణయించింది.

తమకు నష్టమని సుప్రీం కోర్టుకు...

తమకు నష్టమని సుప్రీం కోర్టుకు...

కార్పోరేట్ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించాలని కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది బ్యాంకు. ఇక్కడ ఎస్బీఐకి ఊరట లభించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిని నియమిస్తూ ఎన్సీఎల్టీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బాంబే హైకోర్టులో తాత్కాలిక స్టే పడింది. ఈ స్టేను రద్దు చేయాలని ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును అమల్లోకి తెస్తే తమకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఎస్బీఐ తమ పిటిషన్లో పేర్కొంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు హైకోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని తెలిపింది. రూ.1,700 కోట్ల ప్రజాధనం బ్యాంకుకు రుణపడి ఉన్న అనిల్‌కు వ్యతిరేకంగా దివాలా తీర్పును నిలిపివేయడాన్ని సమర్థించలేమని పేర్కొంది.

అప్పుల్లోకి...

అప్పుల్లోకి...

ఈ కేసులో తమ వాదనలను తెలియజేయాలని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అనిల్ అంబానీ ఆర్.కామ్. అప్పుల్లో కూరుకుపోయింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన జియో దెబ్బకు మరింత కుదేలయింది. 2017 జనవరిలో రుణ చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో ఆర్ఐటీఎల్ రుణాన్ని 26 ఆగస్ట్ 2016 నుండి నిరర్థక ఆస్తిగా ప్రకటించింది. ఈ రెండు సంస్థలు క్లోజ్ అయ్యాయి.

English summary

కోలుకోలేని నష్టం: అనిల్ అంబానీపై దివాలా చర్యకు సుప్రీంకు ఎస్బీఐ | SBI moves Supreme Court to vacate stay on Anil Ambani bankruptcy proceedings

The State Bank of India has moved the Supreme Court seeking a vacation of the stay granted by Delhi High Court on the personal bankruptcy proceedings against Anil Ambani, chairman of Reliance Group.
Story first published: Tuesday, September 8, 2020, 7:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X