For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తక్కువ ధరకే, ఇల్లు, ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే శుభవార్త!

|

తక్కువ ధరకే ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్బీఐ నుండి మీకో గుడ్ న్యూస్. వేలం ద్వారా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. చౌక ధరక ఇంటిని, ప్రాపర్టీని, స్థలం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎస్బీఐ మరోసారీ ఈ-వేలం నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని నచ్చిన ప్రాపర్టీని సాధ్యమైనంత వరకు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ అక్టోబర్ 25వ తేదీన ఈ-వేలం నిర్వహిస్తుంది. కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌కు సంబంధించి ఈ వేలం ఉంటుంది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. మీరు ఇల్లు, ప్రాపర్టీ, దుకాణం, స్థలం కొనుగోలు చేయాలని భావిస్తే ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. తాకట్టులోని ఆస్తులను ఈ-ఎలక్ట్రానిక్ విధానంలో వేలం వేస్తుంటుంది. తాకట్టులోని ప్రాపర్టీ వేలం కాబట్టి, మార్కెట్ ధర కంటే కాస్త తక్కువకు ఇళ్లు, ఇతర ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం.

'ఇక్కడ మీకు బిగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఉంది. ఎస్బీఐ మెగా ఈ-ఆక్షన్ కోసం రిజిస్టర్ చేసుకోండి. ఇందులో మీ బెస్ట్ బిడ్‌ను దాఖలు చేయండి' అని తాజాగా ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ వేలం వివరాలు తెలుసుకోవడానికి bank.sbi/web/sbi-in-the-news/auction-notices/bank-e-auctions
#Auction #EAuction #Properties #SBIMegaEAuction దీనిని చూడాలి.

 SBI mega e auction for properties across India

ఎస్బీఐ ఈ-వేలంలో భాగస్వామ్యం కావాలంటే...

- ఈ-వేలం నోటీసులో పేర్కొన్న విధంగా పర్టిక్యులర్ ప్రాపర్టీకి EMD.

- సంబంధిత ఎస్బీఐ బ్రాంచీలో దాఖలు చేయడానికి కేవైసీ డాక్యుమెంట్ అవసరం.

- వ్యాలిడ్ డిజిటల్ సిగ్నేచర్- బిడ్డర్స్ ఈ-ఆక్షనర్స్‌ను సంప్రదించాలి. లేదా ఇతర ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారా డిజిటల్ సిగ్నేచర్‌ను పూర్తి చేయాలి.

- EMD డిపాజిట్ ఒకసారి సమర్పించిన తర్వాత, కేవైసీ డాక్యుమెంట్స్‌ను సంబంధిత శాఖకు సమర్పించాలి. రిజిస్టర్డ్ లాగ్-ఇన్ ఐడీ, పాస్ వర్డ్ ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు. ఈ-ఆక్షనర్స్ వీటిని పంపిస్తారు.

- బిడ్డర్స్ లాగ్-ఇన్ అయి, ఆక్షన్ సమయంలో బిడ్ దాఖలు చేయాలి.

కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లేదా కొత్త ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలని భావించే వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ కోసం ఇండివిడ్యువల్స్ అవకాశం కలిగి ఉన్నారు. బిడ్డింగ్ ధర మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఎస్బీఐ నుండి డబ్బులు తీసుకొని చెల్లించని వారికి చెందిన ప్రాపర్టీస్ కాబట్టి వాస్తవ మార్కెట్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వేలం ద్వారా ఎస్బీఐ ఈ ప్రాపర్టీస్ కోసం ఇచ్చిన రుణాలను ఇలా రికవరీ చేస్తోంది.

English summary

తక్కువ ధరకే, ఇల్లు, ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే శుభవార్త! | SBI mega e auction for properties across India

State Bank of India will conduct an electronic auction for the mortgage properties — both the commercial and residential properties — on October 25.
Story first published: Thursday, October 14, 2021, 13:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X