For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కస్టమర్లకు గుడ్‌న్యూస్, బల్క్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ టర్మ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్ల నుండి 90 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు రూ.2 కోట్లు, అంతకుమించిన మొత్తంపై వర్తిస్తాయని, ఇది మంగళవారం నుండి అంటే మే 11వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. ఏడు రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై FD వడ్డీ రేటు 3 శాతంగా కొనసాగిస్తున్నారు. 46 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 3 శాతం నుండి 3.50 శాతానికి, 180 రోజుల నుండి 210 రోజుల కాలపరిమితిపై 40 బేసిస్ పాయింట్లు పెంచి 3.50 శాతానికి సవరించింది. 211 రోజుల నుండి ఏడాది లోపు కాలపరిమితిపై 3.3 శాతం ఉండగా, 45 బేసిస్ పాయింట్లు పెంచి 3.75 శాతానికి చేర్చింది.

సీనియర్ సిటిజన్లకు అదనం

సీనియర్ సిటిజన్లకు అదనం

సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌పైన వడ్డీరేట్లని పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిని మినహాయించింది. 46 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 3.5 శాతం నుండి 4 శాతానికి, 180 రోజుల నుండి 210 రోజుల కాలపరిమితిపై 3.6 శాతం నుండి 4 శాతానికి పెంచింది. 211 రోజుల నుండి ఏడాది లోపు కాలపరిమితిపై 3.80 శాతం నుండి 4.25 శాతానికి, ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 4.5 శాతానికి, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 4.75 శాతానికి, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 5 శాతానికి, అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 5 శాతానికి పెంచింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా

ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) కూడా మంగళవారం రుణాల వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. ఈ నెల 12వ తేదీ నుండి ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటును 0.1 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

యూనియన్ బ్యాంకు

యూనియన్ బ్యాంకు

రూ.100 కోట్లకు మించిన సేవింగ్స్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును జూన్ 1వ తేదీ నుండి 20 నుండి 65 బేసిస్ పాయింట్ల మేర పెంచనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రూ.50 లక్షల నుండి రూ.100 కోట్ల వరకు డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 2.9 శాతం వద్ద కొనసాగిస్తోంది. రూ.100 నుండి రూ.500 కోట్ల డిపాజిట్స్ పైన 2.90 శాతం నుండి 3.10 శాతానికి రూ.500 నుండి రూ.1000 కోట్ల డిపాజిట్స్ పైన 2.90 శాతం నుండి 3.40 శాతానికి, రూ.1000 కోట్లకు పైన డిపాజిట్ల పైన 2.90 శాతం నుండి 3.55 శాతానికి పెంచింది. రూ.50 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ డిపాజిట్స్ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.75 శాతానికి పరిమితం చేస్తోంది.

English summary

కస్టమర్లకు గుడ్‌న్యూస్, బల్క్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ | SBI hikes interest rates on bulk term deposits by 40-90 basis points

SBI on Tuesday announced a hike of 40-90 basis points in the interest rates on several bulk term deposits.
Story first published: Wednesday, May 11, 2022, 8:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X