For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI digital services: ఆదివారం..ఆ మూడు గంటలు: అన్నీ క్లోజ్: అ ఒక్కటే

|

ముంబై: టాప్ నేషనలైజ్డ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ ప్లాట్‌ఫామ్ సర్వీసులు ఆదివారం స్తంభించిపోనున్నాయి. మూడు గంటల పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఏవీ పని చేయబోవు. ఒక్క ఆర్టీజీఎస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ సర్వీసులన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తుండటమే దీనికి కారణమని ఎస్బీఐ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు డిజిటల్ సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Canine Coronavirus: కుక్కల నుంచి మనుషులకు సోకే మహమ్మారి: 8 కేసులుCanine Coronavirus: కుక్కల నుంచి మనుషులకు సోకే మహమ్మారి: 8 కేసులు

సాధారణంగా ఈ మూడు గంటల కాలాన్ని నాన్ పీక్ అవర్స్‌గా భావిస్తుంటారు. దీనికితోడు- ఆదివారం కావడం వల్ల ఆర్థికపరమైన కార్యకలాపాలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవు. అందుకే అప్‌గ్రెడేషన్ కోసం ఈ సమయాన్ని ఎస్బీఐ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. శనివారం కూడా దీన్ని చేపట్టింది. వ్యాపార కార్యకలాపాలన్నీ ముగిసిన తరువాత నెఫ్ట్‌లో టెక్నికల్ అప్‌గ్రెడేషన్ చేపడుతుంది. ఆదివారం నాడు దీన్ని మరింత విస్తరించబోతోంది.

SBI digital services will remain affected between 12 and 2 pm on May 23

శనివారం రాత్రి 11:45 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తరువాత 1:15 నిమిషాల వరకు టెక్నికల్ అప్‌గ్రేడ్ కార్యక్రమాలు కొనసాగాయి. రెండో విడతగా ఆదివారం మధ్యాహ్నం 2:40 నిమిషాల నుంచి సాయంత్రం 6:10 నిమిషాల వరకు కూడా దాన్ని కొనసాగిస్తామని వివరించింది. నెఫ్ట్ మాత్రమే కాకుండా.. తన పరిధిలోని యోనో, యోనో లైట్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్.. అన్నీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆర్టీజీఎస్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మిషన్స్.. యధాతథంగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.

English summary

SBI digital services: ఆదివారం..ఆ మూడు గంటలు: అన్నీ క్లోజ్: అ ఒక్కటే | SBI digital services will remain affected between 12 and 2 pm on May 23

The State Bank of India (SBI) has said its digital services will remain affected as an upgrade is to be made to its NEFT system on Saturday, May 22. It will remain affected between 12 and 2 pm on May 23.
Story first published: Saturday, May 22, 2021, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X