For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ డిపాజిట్‌పై వడ్డీ కోత షాక్: రుణాలపై కూడా తగ్గింపు, రూ.లక్షకు 24 తగ్గుదల

|

సేవింగ్స్ ఖాతాలో డబ్బులు దాచుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఈ ఖాతాల్లోని నగదుపై ఇచ్చే వడ్డీ రేటును 0.25 శాతం మేర తగ్గించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ప్రస్తుతం ఉన్న 3 శాతం నుండి 0.25 శఆతం తగ్గించి 2.75గా నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 15వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.

ఐటీ కంపెనీల గుడ్‌న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!ఐటీ కంపెనీల గుడ్‌న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!

11వసారి MCLR తగ్గింపు

11వసారి MCLR తగ్గింపు

బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత నగదు లభ్యత ఉంది. దీంతో పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును మార్చినట్లు వెల్లడించింది. అన్ని కాల వ్యవధి రుణాలపై MCLRను సైతం బ్యాంకు 0.35 శాతం తగ్గించింది. ఏడాది కాల వ్యవధి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లను 0.35 శాతం తగ్గించి 7.75 నుండి 7.40 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం నుండి చూస్తే ఎంసీఎల్ఆర్ తగ్గించడం 11వ సారి.

ఏప్రిల్ 10 నుండి అమల్లోకి.. రూ.24 తగ్గింపు

ఏప్రిల్ 10 నుండి అమల్లోకి.. రూ.24 తగ్గింపు

MCLR తగ్గింపు ఈ నెల 10వ తేదీ నుండి అమలులోకి వస్తుంది. ఏడాది కాల పరిమితి ఉండే ఈ MCLR ఆధారిత వడ్డీ రేటు ఆధారంగానే బ్యాంకులు హోమ్ లోన్స్ వంటి రుణాలు ఇస్తాయి. దీంతో 30 ఏళ్ల కాలపరిమితి ఉండే హోమ్ లోన్ పైన చెల్లించే EMI ప్రతి రూ.లక్షకు రూ.24 చొప్పున తగ్గుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్పొరేట్ రుణాలు, వాహన రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది.

కెనరా బ్యాంకులోను కోత

కెనరా బ్యాంకులోను కోత

కెనరా బ్యాంకు తన రెపో అనుసంధానిత రుణ రేటు (RLLR)ను 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 7.3 శాతానికి పరిమితం చేసింది. ఇవి నిన్నటి నుండి (ఏప్రిల్ 7) అమల్లోకి వచ్చాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (MCLR)ను 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలానికి సంబంధించిన MCLRను 0.35 శాతం కోత వేసి 7.85 శాతానికి, ఆరు నెలల MCLRను 0.2 శాతం తగ్గించి 7.75 శాతానికి తగ్గించింది.

English summary

సేవింగ్స్ డిపాజిట్‌పై వడ్డీ కోత షాక్: రుణాలపై కూడా తగ్గింపు, రూ.లక్షకు 24 తగ్గుదల | SBI cuts MCLR by 35 bps across all tenors from April 10

The bank said in a release that the one-year MCLR has now comes down to 7.40 percent from the earlier 7.75 percent per annum, starting April 10, 2020.
Story first published: Wednesday, April 8, 2020, 8:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X