For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI షాకింగ్: వడ్డీ రేటును భారీగా తగ్గింపు, దేనిపై ఎంత అంటే?

|

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు తగ్గించింది. 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు FDలకు ఇది వర్తిస్తుంది. దీంతో బ్యాంకులో డిపాజిట్ చేస్తే రాబడి మరింత తగ్గనుంది. రూ.2 కోట్లకు పైన గల బల్క్ డిపాజిట్ పైన కూడా వడ్డీ రేటును తగ్గించింది. వీటిపై వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.

ఎస్బీఐకి అవసరమైన ద్రవ్యలభ్యత ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ తగ్గింపు నిర్ణయం నవంబర్ 10వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను కూడా తగ్గించింది. ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకు నుంచి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది.

SBI cuts fixed deposit rates today. Latest rates here

SBI తాజా వడ్డీ రేట్లు

సాధారణ కస్టమర్లకు FD వడ్డీ రేటు

- 7 రోజుల నుంచి to 45 రోజుల వరకు 4.50%
- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 5.50%
- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.80%
- 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు 5.80%
- 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు 6.25%
- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు 6.25%
- 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు 6.25%
- 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు 6.25%

BSNL క్రేజీ ఆఫర్: కాల్ చేస్తే మనీ... మీరు ఫోన్‌చేసి మాట్లాడితే, మీకే డబ్బులిస్తారు!BSNL క్రేజీ ఆఫర్: కాల్ చేస్తే మనీ... మీరు ఫోన్‌చేసి మాట్లాడితే, మీకే డబ్బులిస్తారు!

సీనియర్ సిటిజన్లకు FD వడ్డీ రేటు

- 7 రోజుల నుంచి to 45 రోజుల వరకు 5.00%
- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు 6.00%
- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 6.30%
- 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు 6.30%
- 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు 6.75%
- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు 6.75%
- 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు 6.75%
- 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు 6.75%

English summary

SBI షాకింగ్: వడ్డీ రేటును భారీగా తగ్గింపు, దేనిపై ఎంత అంటే? | SBI cuts fixed deposit rates today. Latest rates here

SBI today announced a cut in retail fixed deposit or FD rates, citing adequate liquidity in the system.
Story first published: Friday, November 8, 2019, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X